Kalki 2898 AD Movie First Day Collections :రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె లాంటి భారీ తారాగణంతో రూపొందించిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. మహాభారతంలోని కొన్ని అంశాలను తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ దీన్ని తెరకెక్కించారు. దాదాపు రూ.600 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించింది. సౌతిండియా, నార్తిండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ ఇదే రేంజ్లో ప్రీ సేల్స్‌ను జరుపుకుని భారీ వసూళ్లను అందుకుంది. దీంతో ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డులతో బిజీ అయిపోయాయి థియేటర్లు.
Kalki 2898 AD Movie Opening Day Collections :అయితే ఈ లెక్కల ఆధారంగా ఓపెనింగ్ డే కలక్షన్లు ప్రభాస్ కెరీర్‌లోనే ఆల్ టైం రికార్డ్ వసూలు చేసేలా కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ రూ.217 కోట్లను దాటేసే అవకాశం ఉంది. ఈ రికార్డును రాజమౌళి డైరక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ రూ.223 కోట్లతో ఆల్రెడీ బ్రేక్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన 'సలార్' ఆ రికార్డు బ్రేక్ చేయలేక రూ.178 కోట్లతోనే ఆగిపోయింది. ఇప్పుడు బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ సారి రికార్డులు బ్రేక్ అయిపోతాయంటున్నారు అభిమానులు. కల్కి 2898 AD ఫస్ట్ డే ఓపెనింగ్స్ రూ.200 కోట్లు దాటితే అది చరిత్ర సృష్టించినట్లే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తొలి రోజు రూ.100 కోట్లు, రూ.200 కోట్లకు పైగా వసూలు చేసిన ఇండియన్ సినిమాలు
ఆర్ఆర్ఆర్ - రూ. 223 కోట్లు
బాహుబలి 2 - రూ. 217 కోట్లు
సలార్ - రూ. 178 కోట్లు
KGF 2 - రూ. 165 కోట్లు
లియో - రూ. 148 కోట్లు
ఆదిపురుష్ - రూ. 140 కోట్లు
సాహో - రూ. 130 కోట్లు
జవాన్ - రూ. 129 కోట్లు
యానిమల్ - రూ. 116 కోట్లు
పఠాన్ - రూ. 106 కోట్లు
ఏదేమైనా కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ అంచనా ఆధారంగా ఫస్ట్ డే వంద కోట్లు వసూలు చేయడం పక్కా అని అర్థమవుతోంది. ఒకవేళ కల్కి మొదటి రోజు రూ.200 కోట్లకు చేరుకోలేకపోతే, ఫస్ట్ డే వంద కోట్లు వసూలు చేసిన ప్రభాస్ ఐదో సినిమాగా నిలుస్తుంది. అంతకుముందు ప్రభాస్ ఓపెనింగ్ డే రూ.100 కోట్ల ఖాతాలో బాహుబలి 2, సాహో, సలార్, ఆదిపురుష్ సినిమాలు ఉన్నాయి.
'కల్కి' ఫస్ట్ డే కలెక్షన్స్ - రూ.217 కోట్ల రికార్డ్‌ను ప్రభాస్ బ్రేక్ చేస్తాడా? - Kalki 2898 AD Opening Collections - KALKI 2898 AD OPENING COLLECTIONS
Kalki 2898 AD Movie First Day Collections : కల్కి 2898 AD సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో అయ్యాయి. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో థియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. అయితే ఈ చిత్ర ఓపెనింగ్ కలెక్షన్స్ రూ.200 కోట్లు వస్తాయని అంతా అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో.
Kalki 2898 AD Movie (source ETV Bharat)
Published : Jun 27, 2024, 1:53 PM IST