తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'తండేల్‌ కోసం నేను 9 నెలల పాటు కష్టపడ్డాను - కానీ అదొక్కటే సరిపోదు' - Naga Chaitanya Interview - NAGA CHAITANYA INTERVIEW

Naga Chaitanya Thandel Movie : టాలీవుడ్ స్టార్ నాగచైతన్య లీడ్ రోల్​లో రూపొందుతున్న 'తండేల్' సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటోంది. అయితే ఆ సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు మీ కోసం.

Naga Chaitanya Thandel Movie
Naga Chaitanya Thandel Movie (Source : ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 10:17 PM IST

Naga Chaitanya Thandel Movie :టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన ఓ మ్యత్య్సకారుడి పాత్రలో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోల్​ కోసం తాను తొమ్మిది నెలల పాటు కష్టపడ్టారంటూ చైతూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

"ఓటీటీలు పాపులర్ అవుతున్న ఈ కాలంలో ఆడియెన్స్​ను థియేటర్లకు రప్పించాలంటే మనం ఏదో ఒకటి కొత్తగా చూపించాలి. అద్భుతమైన విజువల్స్‌తోనే అది సాధ్యమని నా అభిప్రాయం. అయితే, ఈ ఎలిమెంట్ ఒక్కటే సరిపోదు. ప్రస్తుతం మార్కెట్‌కు ఏదైతే అవసరమో దాన్ని గుర్తించి ప్రేక్షకులకు అందించాల్సి ఉంటుంది. స్టోరీతో పాట, దాని స్కోప్​ మేరకు అన్నింటిలోనూ నేచురాలిటీ తీసుకురావడమన్నది ముఖ్యం. అంతే కాకుండా స్టోరీలోని క్యారెక్టర్లకు ఆయా నటీనటులు చక్కగా సరిపోవాలి. తండేల్‌ కోసం దాదాపు 9 నెలల పాటు కష్టపడ్డాను. ఇదొక ఇన్​స్పిరేషనల్ స్టోరీ. శ్రీకాకుళం యాసతో పాటు సహా నా పాత్ర కోసం అవసరమైన ప్రతీదాన్ని నేను నేర్చుకున్నాను. నా కెరీర్‌లోనే ఇదొక భారీ చిత్రం అవుతుంది" అంటూ చైతూ పేర్కొన్నారు.

ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే, ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందట. సాయిపల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని మొదట వేసవికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ అక్టోబర్​కు వాయిదా వేసినట్టు సమాచారం. ఈ మూవీ విడుదలపై ఆ సినిమా యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఇటీవలె ఈ మూవీ గ్లింప్స్​ను మేకర్స్ రివీల్ చేశారు. అందులో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్​లో కనిపించగా, సాయి పల్లవి తన క్యూట్ లుక్స్​తో ఆకట్టుకున్నారు. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ 'దద్దా గుర్తెట్టుకో ఈ పాలి యాట గురి తప్పేదెలేదేస్. ఇక రాజులమ్మ జాతరే' అంటూ చెప్పే డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంది.

దసరా బరిలో చైతూ - దేవరతో తండేల్​ బాక్సాఫీస్ ఫైట్!

బుజ్జితల్లి ఫ్యాన్స్‌కు 'తండేల్' టీమ్ సర్​ప్రైజ్​ వీడియో - Happy Birthday Sai pallavi

ABOUT THE AUTHOR

...view details