Naga Chaitanya Sobhita Marriage:స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. అయితే తన నిశ్చితార్థం గురించి హీరో అక్కినేని నాగార్జున తాజాగా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడారు. నిశ్చితార్థం విషయంలో తామంతా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వాళ్ల పైళ్లిపై కూడా నాగ్ మాట్లాడారు. ఇంతకీ చైతన్య- శోభితా పెళ్లి ఎప్పుడండే?
విడాకుల అనంతరం చైతన్య ఎంతో బాధపడ్డారని అన్నారు. ఎవరితోనూ ఆ బాధను షేర్ చేసుకోలేదని తెలిపారు. తన కుమారుడు మళ్లీ సంతోషంగా ఉండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా వాళ్ల పైళ్లిపై కూడా నాగ్ మాట్లాడారు. అయితే పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున ఈ సందర్భంగా నాగార్జున వెల్లడించారు.
ఈ నిశ్చితార్థం అతి తక్కువ మంది కుటుంబసభ్యులు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్‌మీడియాలో షేర్ చేశారు. 'నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 (08-08-2024) అనంతమైన ప్రేమకు నాంది' అని నాగార్జున పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.