తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'తండేల్‌' జనవరికి సిద్ధమే, కానీ ఓ ట్విస్ట్​ ఇచ్చిన డైరెక్టర్​! - THANDEL MOVIE RELEASE DATE

నాగచైతన్య, సాయిపల్లవి 'తండేల్‌' మూవీ రిలీజ్​ డేట్​పై మాట్లాడిన దర్శకుడు చందూ మొండేటి!

Naga Chaitanya Sai Pallavi Thandel Movie Release Date
Naga Chaitanya Sai Pallavi Thandel Movie Release Date (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 3:20 PM IST

Naga Chaitanya Sai Pallavi Thandel Movie Release Date :అక్కినేని హీరో నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం తండేల్‌. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తున్నారు.

రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్​తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ గురించి చిత్ర దర్శకుడు చందూ మొండేటి ఓ అప్డేట్ ఇచ్చారు. "చిత్రీకరణ దాదాపుగా పూర్తైంది. జనవరికి రెడీగా ఉన్నాం. ఇంకా 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. సంక్రాంతికి రామ్‌చరణ్‌, వెంకటేశ్‌ సినిమాలు రిలీజ్ అయితే, మా సినిమా పోస్ట్ పోన్ అవుతుంది. జనవరి 26న రిలీజ్ చేద్దా మనుకుంటే, ఆ రోజు ఆదివారం కాబట్టి చేయలేం. సంక్రాంతి కన్నా ముందు రిలీజ్​ చేయాలంటే మా చిత్రం పూర్తి కాదు. ఇక ఈ చిత్రంలో ఎన్నో ఎమోషన్స్​ ఉంటాయి. కచ్చితంగా అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తారు" అని చెప్పుకొచ్చారు. అంటే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తండేల్ చిత్రాలన్ని అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. దేశభక్తి అంశాలతో నిండిన రా రస్టిక్‌ ప్రేమ కథతో ఇది తెరకెక్కుతోంది. నాగ చైతన్య సినిమాలో రాజు అనే మత్స్యకారుడిగా నటించారు. రీసెంట్​గానే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్‌ కూడా పూర్తైంది. చైతన్న కెరీర్‌లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ఈ చిత్రం అమ్ముడు పోయిందట. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకుంది.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. గతంలో ఎన్నడూ చేయని సరి కొత్త పాత్రలో చైతూ, డీగ్లామర్‌ లుక్స్‌లో సాయి పల్లవి కనిపించనుంది. కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో నాగ చైతన్యపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్​ను తెరకెక్కించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

'అందుకే నా మొఖంలో మార్పు' - ప్లాస్టిక్ సర్జరీపై మాట్లాడిన నయనతార

'ముంబయికి షిఫ్ట్​ అవ్వడానికి కారణం ఆమెనే! - నా కోసం జో ఎన్నో వదులుకుంది'

ABOUT THE AUTHOR

...view details