Nag Ashwin Kalki 2 :థియేటర్లలో, నెట్టింట ఇలా ఎక్కడ చూసినా 'కల్కి' హవా నడుస్తోంది. రెబల్ స్టార్ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి దూసుకెళ్తోంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ వస్తోందని మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. ఇప్పటికే నిర్మాత అశ్వినీదత్కూడా ఈ విషయం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. ఈ నేప తాజాగా మొదటిసారి నాగ్ అశ్విన్ కూడా ఈ సీక్వెల్‌పై స్పందించారు. అసలు కథ మొదలయ్యేది పార్ట్ 2లోనే అంటూ పేర్కొన్నారు.
"సీక్వెల్‌కు సంబంధించి సుమారు నెలరోజుల పాటు షూటింగ్ చేశాం. అందులో 20 శాతం బెస్ట్‌గా వచ్చింది. ఇంకా పలు ముఖ్యమైన యాక్షన్ సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. వాటిని కొత్తగా ప్రారంభించాలి. ఈ సీక్వెల్‌లోప్రభాస్ , కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్‌ల మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలకం కానుంది" అని అన్నారు.ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల్లో వస్తోన్న ఆదరణపై నాగీ సంతోషం వ్యక్తం చేశారు.
"ప్రేక్షకులు దీన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతోమంది ఆడియన్స్ ఒకసారి కంటే ఎక్కువసార్లు ఈ సినిమాను చూస్తున్నట్లు తెలిసింది. మూవీ సక్సెస్ సాధించిందని చెప్పడానికి అదే సంకేతం" అంటూ ఆడియెన్స్‌ను థ్యాంక్స్ చెప్పారు.