తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలో మృణాల్ ఠాకూర్ సూపర్ హిట్​ సినిమా - 10 రోజుల్లోనే షూటింగ్ పూర్తి! - Mrunal thakur Dhamaka Movie

Mrunal Thakur Movie Shooting 10 Days : స్టార్​ హీరోయిన్​ మృణాల్ ఠాకూర్ నటించిన ఓ సినిమా కేవలం పది రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ చిత్రం మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 12:48 PM IST

Mrunal Thakur Movie Shooting 10 Days : ఓ సినిమా షూటింగ్ అంటే మాములు విషయం కాదు. ఎంతో ఖ‌ర్చు, సమయంతో కూడుకున్న వ్య‌వ‌హారం అనే చెప్పాలి. యాక్టర్స్​ డేట్స్ కుద‌రడంతో పాటు లోకేష‌న్స్ దొర‌కాలి. ఇంకా చెప్పాలంటే ఇర‌వై నాలుగు విభాగాల టెక్నీషియ‌న్స్ అందరూ కలిసి కట్టుగా పని చేస్తేనే ఓ సినిమా పూర్తవ్వడానికి కనీసం నెల‌ల సమయం ప‌డుతుంది. అందులోనూ పైగా ఓ యాక్ష‌న్ సినిమా అంటే అది ఇంకా శ్రమతో కూడుకున్న పని. దర్శకధీరుడు రాజ‌మౌళి లాంటి దర్శకుడు సినిమా చేశారంటే అది కచ్చితంగా నాలుగైదేళ్లు పడుతుంది.

కానీ ఓ సినిమా మాత్రం కేవలం పది రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని హిట్ అందుకుంది. అదే బాలీవుడ్ ధమాకా మూవీ(Mrunal thakur Dhamaka Movie). ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్​లోనే పూర్తి చేశారని బయట కథనాలు ఉన్నాయి. 2021లో రిలీజైందీ చిత్రం. ఇందులో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్య‌న్‌, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా జంటగా న‌టించారు. 2020 డిసెంబ‌ర్ 14న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందట. అనంతరం డిసెంబ‌ర్ 24న షూటింగ్ కంప్లీట్ అయిన‌ట్లు తెలిసింది. ఈ విషయాన్ని హీరో కార్తిక్ ఆర్యన్ కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దర్శకుడు పది రోజుల్లోనే సినిమా తీయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.

ఒకే హోట్​లో : ఈ మూవీ షూటింగ్ మొత్తం 90 శాతం ముంబయిలోని ఓ ఫైవ్‌ స్టార్ హోట‌ల్‌లోనే జరిగిందట. ఆ సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉండ‌టం వల్ల షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు దాదాపు 300 మంది ఆర్టిస్టుల‌కు హోట‌ల్‌లోనే వ‌స‌తి క‌ల్పించారట. అయితే సినిమాలోని కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్​లను మాత్రం ఔట్​ డోర్‌లో షూట్ చేశారట. అది కూడా ఒక్క‌రోజులోనే. కానీ షూటింగ్​కు మాత్రమే పది రోజులు పట్టింది. పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్​కు మాత్రం నాలుగైదు నెలలు పట్టిందట. అయితే ఈ చిత్రం బాలీవుడ్ చరిత్రలో అతి త‌క్కువ రోజుల్లోనే చిత్రీకరణను పూర్తి చేసుకున్న సినిమాల్లో ఒక‌టిగా నిలవడం విశేషం. ఇఫీలోనూ ఈ చిత్రాన్ని స్క్రీనింగ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

ధ‌మాకా క‌థ ఇదే : ఈ చిత్రంలో అర్జున్ ప‌ట్నాయ‌క్ అనే జ‌ర్న‌లిస్ట్​గా కార్తిక్ ఆర్య‌న్ కనిపించారు. ఓ రోజు స్టూడియోలో ఉండగా ఆర్జున్‌కు టెర్ర‌రిస్ట్‌ల నుంచి ఓ ఫోన్ కాల్​ వ‌స్తుంది. బాంద్రా వోర్లి బ్రిడ్జ్‌ను పేల్చివేస్తామ‌ని బెదిరిస్తారు. వారితో జ‌రుగుతున్న సంభాష‌ణ‌ను టీఆర్‌పీ రేటింగ్ కోసం అర్జున్ టెలికాస్ట్ చేస్తాడు. మరి అస‌లు ఆ కాల్ చేసింది ఎవ‌రు? అర్జున్ నుంచి సౌమ్య ప‌ట్నాయ‌క్ (మృణాల్ ఠాకూర్‌) ఎందుకు డివొర్స్ తీసుకుని వేరుగా ఉంటోంది?, అసలు అర్జున్ స్టూడియోలోనూ ఓ బాంబు పెట్టార‌నే విషయం ఎలా తెలిసింది? ఈ ప్ర‌మాదం నుంచి అర్జున్ ప్రాణాల‌తో బతికాడా అన్న‌దే ఈ చిత్ర కథ.

ఈ వారం 20 సినిమా/సిరీస్​లు - ఆ మూడు డోంట్ మిస్​!

బుల్లితెరపైకి రూ.600 కోట్ల బ్లాక్ బాస్టర్​ మూవీ - తెలుగు ప్రేక్షకుల కోసం స్పెషల్​గా!

ABOUT THE AUTHOR

...view details