Mohanbabu Chiranjeevi : తన సినీ నట ప్రయాణంలో ఇటీవలే 50వ వసంతంలోకి అడుగు పెట్టారు సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాల్లో తనకు బాగా ఇష్టమైన పలు చిత్రాలను ఉద్దేశించి గత కొన్ని రోజులుగా ఆయన పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆయా సినిమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. అలా తాజాగా తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక స్పెషల్ మూవీ గురించి ఆయన మాట్లాడారు. అదే 'పట్నం వచ్చిన పతివ్రతలు' (Patnam Vachina Pativrathalu).
మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరు, మోహన్ బాబు అన్నదమ్ములుగా నటించారు. రాధిక, గీత హీరోయిన్లుగా నటించారు. 1982లో విడుదలైన ఈ సినిమా గురించి తాజాగా మోహన్‌బాబు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ చిత్రాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు.
"నా సినీ జర్నీలో 'పట్నం వచ్చిన పతివ్రతల'కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతిభావంతుడైన మౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ పాత్రను పోషించడం, ముఖ్యంగా నా స్నేహితుడు చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయనకు సోదరుడిగా నటించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. నేను ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో ఇదీ ఒకటి" అని మోహన్‌బాబు అన్నారు.