తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నెల తిరగకుండానే ఓటీటీలోకి సిద్ధార్థ్​ లేటెస్ట్ మూవీ ! - ఎక్కడ చూడొచ్చంటే? - SIDDHARTH MISS YOU OTT

సిద్ధార్థ్​ లేటెస్ట్ లవ్​ ఎంటర్​టైనర్​ - నెల తిరగకుండానే ఓటీటీలోకి! - ఎక్కడ చూడొచ్చంటే?

Miss You OTT
Siddharth (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 9 hours ago

Siddharth Miss You OTT :స్టార్ హీరోసిద్ధార్థ్‌, ఆషికా రంగనాథ్‌ లీడ్ రోల్స్​లో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం 'మిస్‌ యు'. ఎన్‌.రాజశేఖర్‌ డైరెక్షన్​లో ఈ సినిమా రూపొందింది. ట్రైలర్​పై ఇంట్రెస్ట్ పెంచిన ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలైంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి సైలెంట్​గా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.

అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్​పై ఎన్నో రూమర్స్​ వచ్చినప్పటికీ మేకర్స్ వాటిపై స్పందించలేదు. కానీ ఇప్పుడు స్వయంగా అమెజాన్‌ తమ అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను ఓటీటీలో తామే రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇక తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్​కు అందుబాటులోకి వచ్చినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

స్టోరీ ఏంటంటే :
సినిమా డైరెక్టర్ అవ్వాలంటూ క‌ల‌లు కనే యువ‌కుడు వాసు (సిద్ధార్థ్‌). ప్రొడ్యూసర్లను క‌లిసి క‌థ‌లు చెప్పే ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే అంతలోనే ఓ ప్రమాదానికి గురై త‌న జీవితంలో చివ‌రిగా గ‌డిచిన రెండేళ్ల జ్ఞాప‌కాలను మ‌ర్చిపోతాడు. దీంతో కోలుకున్న వాసు అనుకోకుండా క‌లిసిన బాబీ (క‌రుణాక‌ర‌న్‌)తో క‌లిసి బెంగళూరు వెళ‌తాడు. అక్కడ కేఫ్‌లో ప‌నిచేస్తున్న సమయంలో సుబ్బల‌క్ష్మి (ఆషికా రంగ‌నాథ్‌)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. అయితే ఆమె మాత్రం తన లవ్​ను రిజెక్ట్ చేస్తుంది.

ఇదిలా ఉండగా, త‌న త‌ల్లిదండ్రుల‌కి ఈ విష‌యాన్ని చెప్పి ఎలాగైనా సరే సుబ్బలక్ష్మిని ఒప్పించాల‌ని తిరిగి ఇంటికి వస్తాడు వాసు. కానీ ఆమె ఫొటో చూసిన కుటుంబ స‌భ్యులు, స్నేహితులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. లక్ష్మితో పెళ్లి కుద‌ర‌ద‌ని, ఆమెను కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాల‌ని అంటారు. అయినా సరే తననే పెళ్లి చేసుకుంటానని మొండిగా ఉంటాడు వాసు. ఇంతకీ అస‌లు సుబ్బల‌క్ష్మితో వాళ్ల ఫ్యామిలీ పెళ్లి ఎందుకు వద్దంటుంది? ఇంత‌కీ ఆమె ఎవ‌రు? వాసుకీ, ఆమెకీ గ‌తంలో ఏం జ‌రిగింది? ఇటువంటి విషయాలు తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.

స్టేజ్‌పై ఎమోషనలైన సిద్ధార్థ్‌ - ఆ సినిమాకు స్ట్రాంగ్ కౌంటర్! - Siddharth Emotional Video

'అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్య ఉందా?' - వైరల్​గా హీరో సిద్ధార్థ్​ సమాధానం!

ABOUT THE AUTHOR

...view details