Mega hero Saidharam Tej helps pavala shyamala :టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల గురించి చాలా మంది ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. గత కొన్నేళ్లుగా అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆమె ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు ఆమె దాతల సాయంపైనే జీవనం సాగిస్తున్నారు.గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెకు సాయం అందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఆర్థిక సాయం చేశారు. లక్ష రూపాయలను అందజేశారు. ఈ విషయాన్ని ఆమె తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు.
"మా అమ్మాయికి ఆపరేషన్ జరిగినప్పుడు సాయి ధరమ్ తేజ్ నాకు కాల్ చేశారు. ఎంతో ధైర్యానిచ్చారు. వచ్చి కలుస్తాని కూడా అన్నారు. కానీ ఆ తర్వాత చాలా రోజులైపోయింది. దీంతో నన్ను మర్చిపోయి ఉంటారని అనుకున్నాను. కానీ ఇప్పుడాయన నన్ను గుర్తుపెట్టుకొని మరీ సాయం చేశారు. అందుకు ధన్యవాదాలు చెబుతున్నాను" అని పావల శ్యామలా పేర్కన్నారు.
అనంతరం, ఆమె సాయిధరమ్ తేజ్‌తో వీడియో కాల్‌లోనూ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘‘ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. చనిపోవాలని అనుకున్నాను. సమయానికి మీరు సాయం చేసి నాకు, నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు’’ అంటూ కన్నీరు కార్చారు.