తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్య, మహేశ్ మల్టీస్టారర్- క్లూ ఇచ్చిన తమన్- స్టోరీ కూడా కంప్లీట్! - Balayya Mahesh Movie - BALAYYA MAHESH MOVIE

Balayya Mahesh Movie: మాస్ కా బాస్ బాలయ్య బాబు, క్లాసీ హీరో మహేష్ బాబు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? వీరిద్దరూ కలిసి మల్లీస్టారర్ చేస్తారన్న మ్యూజిర్ డైరెక్టర్ తమన్ మాటల్లో వాస్తవమెంత? తెలుసుకుందాం.

Balayya Mahesh Movie
Balayya Mahesh Movie (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 6:06 PM IST

Balayya Mahesh Movie:క్లాసీ లుక్స్​తో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసే మహేష్ బాబు, మాస్ డైలాగ్స్​తో ఆడియన్స్​ను ఆకట్టుకునే బాలయ్య బాబు ఒకే తెర మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? వీరిద్దరూ కలిసి మల్టీసారర్ ఫిల్మ్ చేస్తే ఎంత క్రేజీగా ఉంటుంది. వింటుంటేనే గూస్​బంప్స్​ వస్తున్నాయి కదూ! ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నోటి నుంచి వచ్చిన ఈ మాటల్లో నిజమెంతో తెలియదు కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ (Indian Idol) సింగింగ్ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో మూడవ సీజన్​కు సంగీత దర్శకుడు తమన్ జడ్జిగా వ్యవహరిస్తుండగా సింగర్ శ్రీరామచంద్ర యాంకరింగ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సెమీఫైనల్​లో భాగంగా యాంకర్ శ్రీరామచంద్ర తమన్​ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. 'బాలకృష్ణ, మహేష్ బాబు ఇద్దరి సినిమాలకు ఒకేసారి మ్యూజిక్ డైరెక్షన్ చేసే అవకాశమొస్తే, ఇద్దరిలో ఎవరి చిత్రానికి పని చేస్తారు?'అని అడిగారు. దీనికి తమన్ స్పందించారు. బాలయ్య బాబు, మహేష్ బాబు కలిసి మల్టీసారర్ సినిమా చేస్తారని, ఆ సినిమా కథ కూడా తాను విన్నానని చెప్పకొచ్చాడు. దీనికి యాంకర్ శ్రీరామచంద్రతో పాటు ప్రేక్షకులంతా ఈలలు వేస్తూ గోల చేశారు.

క్లాస్, మాస్ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కుతుందనే మాట విన్నాక ఆడియన్స్ ఊరుకుంటారా. సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు, చర్చలు, ఎగ్జయిట్ మెంట్​తో వీడియోని వైరల్ చేసేశారు. తమన్ ఊరికే సరదాకి ఈ మాట అన్నాడా లేక నిజంగానే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందా తెలియక ప్రేక్షకాభిమానులు సతమతమవుతున్నారు. ఈ మల్టీస్టారర్ గురించి ప్రేక్షకుల ఊహలే తప్ప సినిమా కథ, దర్శకత్వం లాంటి వాటి గురించి ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇదే నిజమైతే స్పీకర్లే కాదు బాక్సాఫీస్​ రికార్డులు బద్దలవడం ఖాయమనే చెబుతున్నారు సినీప్రేక్షకులు.

ప్రస్తుతం బాబీ కొల్లి డెరెక్షన్లో యాక్షన్ ఓరియోంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న NBK 109 సినిమాతో బాలయ్య బాబు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక మహేష్ బాబు విషయానికొస్తే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు కోసం మహేష్ తన లుక్ మార్చుకొని సిద్ధంగా ఉన్నారు.

బాలయ్య - బోయపాటి 'బీబీ 4'లో విలన్​గా టాలీవుడ్ హీరో! - ఎవరంటే? - Balakrishna Boyapati BB4 Movie

మహేశ్​ వాయిస్​ ఓవర్​తో 'ముఫాసా' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది! - ఫ్యాన్స్ ఫిదా - Mufasa Telugu Trailer

ABOUT THE AUTHOR

...view details