Legend Movie Re Release Trailer :నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్లో వచ్చిన సాలిడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'లెజెండ్'. 2014లో విడుదలైన ఈ సినిమా అటు ఫ్యాన్స్‌కే కాకుండా ఇటు ఆడియెన్స్‌కు కూడా గూస్బంప్స్ తెప్పించింది. బాలయ్య రెండు డిఫరెంట్ వైబ్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక అందులోని పవర్ఫుల్ డైలాగ్స్ కూడా అభిమానులను ఉత్తేజపరిచింది. అయితే ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఏదాడితో ఈ సినిమా సరిగ్గా 10 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 30న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.
- బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో విడుదలైన రెండో సినిమా ఇది. అంతకుముందు ఈ ఇద్దరూ కలిసి పని చేసిన 'సింహా' కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది.
- ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్లో మెరిశారు. అందులో ఒకటి జయ్‌దేవ్ అలియాస్ లెజెండ్ ఇంకా కృష్ణ. ఈ రెండింటిలోనూ ఆయన డిఫరెంట్ వైబ్స్ అండ్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు.
- ఈ సినిమాతోనే ఫ్యామిలీ స్టార్ జగపతిబాబు తొలిసారి విలన్ రోల్లో మెరిశారు. జితేంద్ర అనే రోల్లో ఆయన కనిపించారు.
- తొలుత ఈ సినిమాలోని ప్రతినాయకుని పాత్ర కోసం కోసం యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్‌ను తొలుత సంప్రదించారట. కానీ కొన్ని కారణాల వల్ల దానికి ఆయన ఓకే చెప్పలేదట.
- ఇక ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీలు సందడి చేశారు. ఫ్లాషబ్యాక్లో రాధిక ఆప్టే మెరవగా, ప్రెజెంట్లో సోనల్ చౌహన్ నటించింది.
- అప్పట్లోనే ఈ 'లెజెండ్' మూవీ దాదాపు 31 సెంటర్లలో వంద రోజులు ఆడింది. మరో రెండు సెంటర్లలో 175 రోజులు రన్ అయింది.
- 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా 2017 వరకు థియేటర్లలో ఆడింది. ప్రొద్దుటూరు జిల్లా అర్వేటిలో 55 రోజులు ఆడింది. ఆ తర్వాత అక్కడ నుంచి అదే ప్రాంతంలోని అర్చన థియేటర్‌కు షిఫ్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా అర్చన థియేటర్లో 1000 రోజులు దాటేసి ఏకంగా 1116 రోజులు ఆడి రికార్డుకెక్కింది.
- బాలయ్య సినిమాల్లో డబుల్ సెంచరీ దాటిన సినిమాల్లో 'లెజెండ్' కూడా ఒకటి. 'ముద్దుల మావయ్య', 'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు', 'సింహా' తర్వాత ఆ లిస్ట్‌లో లెజెండ్ ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.