తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

200 మిలియన్​ ప్లస్​ - నెట్టింట కుర్చి మడతపెట్టి సాంగ్ ర్యాంపేజ్​! - Kurchi Madatha Petti Song - KURCHI MADATHA PETTI SONG

Kurchi Madatha Petti Song : మహేశ్​ బాబు లీడ్​ రోల్​లో వచ్చిన గుంటూరు కారం మూవీలోని కుర్చి మడతపెట్టి సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో మైల్​స్టోన్​ను దాటింది. ఆ విశేషాలు మీ కోసం.

Kurchi Madatha Petti Song
Kurchi Madatha Petti Song

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 12:38 PM IST

Updated : Apr 20, 2024, 4:13 PM IST

Kurchi Madatha Petti Song :సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల కాంబినేషన్​లో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా రోజుకో రికార్డును తన ఖాతాలో వేసుకుంటోంది. ముఖ్యంగా కుర్చి మడతపెట్టి సాంగ్​ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్​లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. గ్రాండ్ ఈవెంట్స్​, బర్త్​డే ఫంక్షన్స్ ఇలా ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తోంది. రిలీజైన కొన్ని నెలల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది.

అయితే ఈ సాంగ్​ తాజాగా మరో మైల్​స్టోన్​ను దాటింది. యూట్యూబ్​లో ఇప్పుడు దాదాపు 200 మిలియన్ పైగా వ్యూస్​ను అందుకుంది. ఇది విన్న మహేశ్ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పాట మరిన్ని మైల్​స్టోన్స్​ దాటాలని కోరుకుంటున్నారు.

గతంలోనూ ఈ సాంగ్ పలు రికార్డులను సొంతం చేసుకుంది. అమెరికా హూస్టన్ లో జరిగిన నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్​లో ఈ పాటకు అక్కడి వారు స్టెప్పులేసి అదరగొట్టారు. దీంతో ఆ స్టేడియం మొత్తం హోరెత్తింది. ఆఫ్రికాలోనూ ఈ పాటకు రీల్స్ చేశారు.

ఇదిలాఉండగా, ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్ కంపెనీ 'నిస్సాన్ మోటార్ స్పోర్ట్స్' కూడా తమ కొత్త బ్రాండ్ కారుని ప్రమోట్ చేయడం కోసం ఇన్‌స్టాగ్రామ్​లో ఈ సాంగ్​ను వాడుకుని ఓ రీల్ పోస్ట్ చేసింది. అది కూడా నెట్టింట మంచి వ్యూవర్​షిప్ అందుకుంది. భాష రాకపోయినా కూడా అక్కడి వారు ఈ సాంగ్​ను లూప్​లో వింటున్నారు. ఇదంతా చూస్తుంటే ఓవర్సీస్​లో ఈ పాటకు ఓ రేంజ్​లో ఫ్యాన్స్​ ఉన్నారని అర్థమైపోతోంది.

Guntur Kaaram Cast : ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే, మహేశ్​, శ్రీలీల కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ మంచి వసూళ్లు సాధించింది. ఇందులోని సాంగ్స్, పలు యాక్షన్​ సీన్స్​కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా కుర్చి మడతపెట్టి సాంగ్​లో శ్రీలీల, మహేశ్ డ్యాన్స్​కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సాంగ్​కు తొలుత నెగిటివిటీ వచ్చినప్పటికీ స్లోస్లోగా అందరి నోట నానుతూ వచ్చింది.

'గుంటూరు కారం' రూ.200 కోట్ల మార్క్- మహేశ్​బాబు ఆల్​టైమ్ రికార్డ్!

మహేశ్, శ్రీలీల ఫుల్ మాస్ డ్యాన్స్- 'కుర్చీని మడతబెట్టి' సాంగ్ అదుర్స్​!

Last Updated : Apr 20, 2024, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details