ETV Bharat / offbeat

మీరు వాడుతున్న బెల్లం మంచిదేనా? - FSSAI సూచనలతో కల్తీని క్షణాల్లో కనిపెట్టండిలా! - TIPS TO FIND THE PURITY OF JAGGERY

-బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -కల్తీ బెల్లాన్ని కనిపెట్టేందుకు నిపుణుల సూచనలు

Tips to Find the Purity of Jaggery
Tips to Find the Purity of Jaggery (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 2:23 PM IST

Tips to Find the Purity of Jaggery: మన రోజువారి జీవితంలో బెల్లం వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే చాలా మంది నిపుణులు భోజనం తరువాత ఓ బెల్లం ముక్క తినమని సలహా ఇస్తుంటారు. ఇక మార్కెట్లో నల్లబెల్లం, తెల్లబెల్లం, తాటి బెల్లం, పాకం బెల్లం అంటూ రకరకాలుగా దొరుకుతుంది. అయితే ఈ బెల్లాలన్నీ సహజసిద్ధంగా తయారు చేసినవైతే ఎటువంటి సమస్య ఉండదు. కానీ రసాయనాలు కలిపి చేసినవి ఉపయోగిస్తేనే ఇబ్బందులు. మరి బెల్లంలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఎలా? దీనికోసం ఏదైనా ఉపాయం ఉందా? అంటే ఎస్​ అంటోంది ఫుడ్​ సేఫ్టీ అండ్​ స్టాండర్డ్స్​ ఆథారిటీ ఆఫ్​ ఇండియా(FSSAI). అందుకోసం కొన్ని టిప్స్​ సూచిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బెల్లంలో బేకింగ్​ సోడా​ను గుర్తించడం ఎలా: తూకం పెరగడానికి, ఆకర్షణీయంగా కనిపించేందుకు బెల్లం తయారీలో బేకింగ్​ సోడాను కలుపుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ కల్తీని కనిపెట్టేందుకు

  • ఓ టెస్ట్​ ట్యూబ్​లోకి పావు టీ స్పూన్​ బెల్లం తురుము వేయాలి.
  • ఇప్పుడు ఆ ట్యూబ్​లోకి 3ml హైడ్రోక్లోరిక్​ యాసిడ్​ యాడ్​ చేయాలి.
  • నిజమైన బెల్లం అయితే ఎటువంటి మార్పు ఉండదని, ఒకవేళ ఆ బెల్లంలో బేకింగ్​ సోడా కలిపితే బెల్లం మిశ్రమంపై బుడగలు ఏర్పడతాయని చెబుతున్నారు.

బెల్లంలో చాక్​ పౌడర్​ను గుర్తించడం:

  • ముందుగా ఓ గాజు గ్లాస్​లోకి వాటర్​ తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి 10 గ్రాముల బెల్లం వేసి కరిగించాలి.
  • బెల్లంలో చాక్​పౌడర్​ కలిస్తే అది నీటి అడుగుకు చేరుతుందని, ఒకవేళ కల్తీ జరగకపోతే అడుగు భాగానా ఏది ఉండదంటున్నారు.

నీటి పరీక్ష:

  • ఒక గ్లాసు నీటిలో ఒక చిన్న ముక్క బెల్లం వేయాలి.
  • బెల్లం కరిగిన తర్వాత అది స్వచ్ఛమైనదైతే నీటికి ముదురు గోధుమ రంగును ఇస్తుంది.
  • నకిలీ బెల్లం అయితే కరగకుండా గ్లాసు అడుగుభాగానికి చేరుతుందని లేదా నీరు తెల్లగా మారుతుందని అంటున్నారు.

రంగు: బెల్లం స్వచ్ఛమైనదా? లేదా కల్తీ అయినదా? అని గుర్తించడంలో దాని రంగు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ముదురు గోధుమ రంగులో ఉండే బెల్లం ఉత్తమమని, పసుపు, లేత గోధుమరంగులు కలిగిన బెల్లంలో రసాయనాలు కలుపుతారని అంటున్నారు. ఎందుకంటే చాలా సార్లు చెరకు రసం కలపడం వల్ల బెల్లం ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. గోల్డెన్ బ్రౌన్ నుంచి డార్క్ బ్రౌన్ వరకు మార్కెట్‌లో ప్రతి రంగు బెల్లం అందుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ముదురు గోధుమ రంగు బెల్లం మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

కల్తీ వంట నూనెతో క్యాన్సర్​ ముప్పు! - FSSAI సూచనలతో స్వచ్ఛతను క్షణాల్లో కనిపెట్టండిలా!

అలర్ట్​: మీరు ఉపయోగించే కాఫీ పొడి స్వచ్ఛమైనదేనా? - FSSAI సూచనలు పాటించి క్షణాల్లో తెలుసుకోండిలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.