Whatsapp Music for Status Updates Feature: ప్రముఖ ఇన్స్టంట్ మెసెజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్ల కోసం కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇది వాట్సాప్‌లో స్టేటస్లు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడే యూజర్లకు బాగా ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా అసలేంటీ ఫీచర్? దీన్ని ఎలా ఉపయోగించాలి? వంటి వివరాలు మీకోసం.
అసలేంటీ ఫీచర్?: వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను మ్యూజిక్ ఆఫ్ స్టేటస్ అప్డేట్స్ పేరుతో తీసుకొస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫేవరెట్ మ్యూజిక్‌ను వాట్సాప్ స్టేటస్‌కి యాడ్ చేయొచ్చు. ఇప్పటి వరకు వాట్సాప్‌లో స్టేటస్ పెడితే దానితో మ్యూజిక్‌ను అటాచ్ చేసే ఆప్షన్ లేదు. అయితే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన మ్యూజిక్‌ను మీ స్టేటస్‌తో అటాచ్ చేయొచ్చు.
ఈ మేరకు కొత్త వాట్సాప్ ఫీచర్లను గుర్తించి వాటి గురించి సమాచారాన్ని అందించే వాబీటాఇన్ఫో వెబ్‌సైట్ దీనిపై సమాచారం అందించింది. ఈ సమాచారం ప్రకారం వాట్సాప్ కొత్త మ్యూజిక్ స్టేటస్ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.25.2.5 బీటా వెర్షన్‌లో ఉంది. ఈ అప్డేట్ రోల్ అవుట్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం కొంతమంది ఎంపిక చేసిన బీటా యూజర్లు మాత్రమే దీన్ని ఉపయోగించగలరు. మరికొన్ని వారాల్లో వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ తమ స్టేటస్‌కు మ్యూజిక్‌ను అటాచ్ చేసుకునే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
దీన్ని ఉపయోగించడం ఎలా?: ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు స్టేటస్‌లో పిక్చర్ లేదా టెక్స్ట్‌ను అప్లోడ్ చేసేటప్పుడు డ్రాయింగ్ ఎడిటర్లో కలర్ ఛేంజ్, టెక్స్ట్, ఇమోజీ, క్రాప్‌తో పాటు ఎడమ వైపున ఈ కొత్త మ్యూజిక్ ఐకాన్ కన్పిస్తుంది. ఈ ఆప్షన్‌పై ట్యాప్ చేయడం ద్వారా యూజర్లు తమ స్టేటస్ ప్రకారం తమకు నచ్చిన సాంగ్స్ లేదా ఆర్టిస్ట్ కోసం సెర్చ్ చేసి దాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా అది స్టేటస్‌కు యాడ్ అయిపోతుంది. వినియోగదారులు వాట్సాప్ స్టేటస్‌లో ఫొటోలు, వీడియోలు రెండింటికీ ఈ మ్యూజిక్‌ను జోడించొచ్చు.
📝 WhatsApp beta for Android 2.25.2.5: what's new?
— WABetaInfo (@WABetaInfo) January 18, 2025
WhatsApp is rolling out a feature to share music through status updates, and it's available to some beta testers!
Some users can experiment with this feature by installing certain previous updates.https://t.co/7uzD671izM pic.twitter.com/kvBPpsbkut
ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని పోస్ట్ చేయడం మాదిరిగా ఉంటుంది. మెటా ఫొటో షేరింగ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని పోస్ట్ చేసేటప్పుడు మ్యూజిక్‌ను జోడించే ఫీచర్ ఉంది. ఇప్పుడు మెటా ఈ ఫీచర్‌ను వాట్సాప్‌లో కూడా రిలీజ్ చేయడం ప్రారంభించింది.
యాపిల్ సంచలన నిర్ణయం- ఏఐ జనరేటెడ్ ఎర్రర్-ప్రోన్ ఫీచర్ తొలగింపు!
మస్క్ స్పేస్ఎక్స్ ప్రయోగం విఫలం- లాంఛైన కాసేపటికే పేలిపోయిన రాకెట్!- వీడియో వైరల్
దేశంలోనే అతిపెద్ద ఆటో ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని- 100కి పైగా కొత్త వాహనాల ప్రదర్శనలు!