తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సీక్రెట్​ రివీల్​ - ఎంగేజ్మెంట్ చేసుకున్న 'తీన్​మార్' హీరోయిన్​ ? - కృతి కర్బంద బాయ్​ఫ్రెండ్​

Kriti Kharbanda Engagement : బీటౌన్ కపుల్​ కృతి కర్బంద - పులకిత్​ సామ్రాట్​ తాజాగా మరోసారి వార్తలోకెక్కారు. వీరి లేటెస్ట్ ఫోటో చూసిన ఫ్యాన్స్ ఈ ఇద్దరికి ఎంగేజ్​మెంట్ అయ్యిందంటూ గుసగుసలాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిదంటే ?

Kriti Kharbanda Engagement
Kriti Kharbanda Engagement

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 1:08 PM IST

Updated : Jan 30, 2024, 1:40 PM IST

Kriti Kharbanda Engagement :'తీన్‌మార్‌', 'ఒంగోలుగిత్తా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బంద. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ చిన్నది తన బాయ్​ఫ్రెండ్​తో అప్పుడప్పుడు నెట్టింట ప్రత్యక్షమవుతూ సందడి చేస్తుంటుంది. ఈ ఇద్దరూ తమ క్యూట్​ పిక్స్​ను షేర్​ చేస్తూ ఫ్యాన్స్​ను అలరిస్తుంటారు.

అయితే తాజాగా ఈ జంట మరోసారి నెట్టింట ట్రెండ్​ అయ్యారు. ఇటీవలే ఓ ఫ్యామిలీ ఈవెంట్​లో సందడి చేసిన ఈ జంట గ్రూప్​ ఫొటోకు ఫోజులిచ్చారు. అందులో కృతి, పులకిత్​ ఒకే రకమైన రింగ్స్​ వేసుకుని కనిపించారు. దీంతో ఈ జంట సీక్రెట్​గా ఎంగేజ్​మెంట్ చేసుకుందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో వీరు త్వరలో అఫీషియల్​గా చెప్పేందుకు వెయిట్​ చేస్తున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Kriti Kharbanda Movies : ఇక కృతి సినిమాల విషయానికి వస్తే - 'బోణీ' అనే తెలుగు సినిమాతో కృతి టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే ఆమె తన కెరీర్​ను మొదలుపెట్టింది. తొలి సినిమా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టనప్పటికీ, నటిగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో తెలుగులో వరసు ఆఫర్లు వచ్చాయి. దీంతో 'బోణీ' తర్వాత 'తీన్‌మార్', 'అలా మొదలైంది'. 'మిస్టర్ నూకయ్య', 'ఒంగోలు గిత్త', 'ఓం త్రీడీ', 'బ్రూస్ లీ' ఇలా టాలీవుడ్​లో వరుస ఆఫర్లు అందుకుని ఇక్కడి ప్రేక్షకులకు చేరువైంది.

ఆ తర్వాత కొంతకాలానికి బీటౌన్​కు షిష్ట్​ అయ్యి అక్కడి ఆడియెన్స్​ను అలరించింది. అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ సినిమాలపై ఫోకస్​ పెట్టింది. అప్పుడప్పుడు కన్నడ, తమిళ సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్‌తో ఈమె రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. కొంత కాలం వీటిపై స్పందించని జంట, ఆ తర్వాత ఆ వార్తలు నిజమే అంటూ ఒప్పుకున్నాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరూ తమ రిలేషన్​షిప్​ను తెలియజేసేలా పలు పోస్ట్​లు నెట్టింట షేర్ చేసి సందడి చేశారు. కలిసి పలు చోట్లకు తిరిగారు. ప్రస్తుతం ఈ జంట బీటౌన్​లో పలు ప్రాజెక్టులతో బిజీ లైఫ్​ గడుపుతున్నారు.

అందంతో మత్తెక్కిస్తోన్న 'తీన్​మార్' భామ

ఆ బాలీవుడ్​ నటుడితో ప్రేమలో ఉన్నా: కృతి కర్బందా

Last Updated : Jan 30, 2024, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details