New Upcoming Smartphones 2025: ఈ న్యూ ఇయర్‌కి ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా? అయితే ఆగండి.. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి కొంగొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. వాటిలో శాంసంగ్, ఒప్పో, వన్‌ప్లస్, రెడ్మీ వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనవరిలో విడుదల చేసేందుకు రెడీగా ఉన్న మొబైల్స్ జాబితా మీకోసం.
Redmi 14C 5G:
Introducing the all-new #Redmi14C 5G – the #2025G smartphone everyone has been waiting for!
— Redmi India (@RedmiIndia) December 27, 2024
It’s time to make a style resolution and elevate your connectivity with the power of #5G.
Launching on 6th January 2025.
Get notified: https://t.co/kUp6U9oLHq
'రెడ్మీ 14C 5G' స్మార్ట్‌ఫోన్ జనవరి 6న మన ఇండియన్ మార్కెట్‌తో పాటు ఇతర ప్రపంచ మార్కెట్లలో కూడా లాంఛ్ కానుంది. దీని మైక్రోసైట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఇప్పటికే లైవ్ అవుతోంది. అంటే రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ మధ్యలో పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరాతో వస్తుంది.
ఇది 'రెడ్మీ 14R 5G' రీబ్యాడ్జ్డ్ వెర్షన్ కావచ్చని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజం అయితే ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్, 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీతో రావొచ్చు. ఇది 6.68-అంగుళాల 120Hz HD ప్లస్ LCD స్క్రీన్, ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్‌ఓఎస్‌ను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇక కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. ఈ 'రెడ్మీ 14C 5G' ఫోన్ బ్లాక్, బ్లూ, పర్పుల్ షేడ్స్‌లో లాంఛ్ కావచ్చు.
OnePlus 13 Series:
It's time to experience unmatched speed, refined craftsmanship, and effortless innovation. Inspired by the Never Settle spirit, get ready to meet the all-new #OnePlus13 Series on January 7, 2025
— OnePlus India (@OnePlus_IN) December 17, 2024
వన్‌ప్లస్ కంపెనీ జనవరి 7న భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్లో 'వన్‌ప్లస్ 13 సిరీస్'ను రీలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో 'వన్‌ప్లస్ 13', 'వన్‌ప్లస్ 13R' అనే రెండు మోడల్స్ రానున్నన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్‌ల మైక్రోసైట్ అమెజాన్‌లో లైవ్ అవుతోంది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్ కలర్ ఆప్షన్స్, స్పెషల్ ఫీచర్లపై సమాచారం కూడా రివీల్ అయింది. 'వన్‌ప్లస్ 13' స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉండగా, 'వన్‌ప్లస్ 13R' మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. వీటితో పాటు ఈ రెండు ఫోన్లు 'వన్‌ప్లస్ AI' సపోర్ట్‌తో ఏఐ ఫీచర్లను కలిగి ఉంటాయి.
'వన్‌ప్లస్ 13' ఇండియాలో ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్, మిడ్‌నైట్ ఓషన్ కలర్ ఆప్షన్‌లలో ప్రారంభం కానుంది. ఇక 'వన్‌ప్లస్ 13R' ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్ షేడ్స్‌లో వస్తుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లలోనూ 6000mAh బ్యాటరీ ఉంటుంది. 'వన్‌ప్లస్ 13' డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీతో IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో 'వన్‌ప్లస్ 13' ధర రూ. 67,000-70,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇక 'వన్‌ప్లస్ 13R' సింగిల్ ర్యామ్, (12GB+256GB) స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుందని సమాచారం. అయితే దీని ప్రైస్ రేంజ్ వివరాలు మాత్రం ఇంకా రివీల్ కాలేదు.
Samsung Galaxy S25 Series:
'శాంసంగ్ గెలాక్సీ S25' సిరీస్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ అప్‌కమింగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ జనవరి 22, 2025న జరుగుతుందని టెక్ నిపుణుల అంచనా. సమాచారం ప్రకారం.. 'గెలాక్సీ S25' సిరీస్‌లో మూడు మోడల్ మొబైల్స్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అవి 'గెలాక్సీ S25', 'గెలాక్సీ S25 ప్లస్', 'గెలాక్సీ S25 అల్ట్రా'. ఈ అప్డేటెడ్ మోడల్స్ మెరుగైన కెమెరా, పెర్ఫార్మెన్స్తో రానున్నాయి. ఇక వీటి టాప్ స్పెక్ విషయానికి వస్తే.. 'గెలాక్సీ S25 అల్ట్రా' ఫ్లాగ్షిప్ పెర్ఫార్మెన్స్ను అందించే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
Oppo Reno 13 5G Series:
Familiar, yet so refreshingly new. Can you guess what’s coming? 👀#OPPOReno13Series #OPPOAIPhone pic.twitter.com/Vp7pH19taX
— OPPO India (@OPPOIndia) December 23, 2024
'ఒప్పో రెనో 13 5G' సిరీస్ రెండు మోడల్స్‌తో వస్తుంది. అవి ఒప్పో రెనో 13 5G, ఒప్పో రెనో 13 ప్రో 5G. ఈ రెండు మోడళ్లు మిడ్-రేంజ్ సెగ్మెంట్లో లాంఛ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 5,640mAh బ్యాటరీతో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్తో వస్తాయని పుకార్లు ఉన్నాయి. ఒప్పో వీటి డిజైన్‌ను టీజ్ చేయడం ప్రారంభించింది. అయితే కంపెనీ వీటి అధికారిక లాంఛ్ తేదీ ఇంకా వెల్లడించలేదు.
Poco X7 Series:
Don't just meet expectations; Smash them 😈#POCOX7 Series launching on 9th Jan | 5:30 PM IST on #Flipkart pic.twitter.com/aHCFNVDQaV
— POCO India (@IndiaPOCO) December 30, 2024
'పోకో X7' సిరీస్ జనవరి 9, 2025న రిలీజ్ కానుంది. ఈ లైనప్‌లో 'పోకో X7 5G', 'పోకో X7 ప్రో 5G' వంటి మోడల్స్ డ్యూయల్-టోన్ ఎల్లో, బ్లాక్ కలర్ వేరియంట్‌లో వీగన్ లెదర్ ఫినిషింగ్‌తో రానున్నాయి.
Realme 14 Pro:
Meet the phone that’s rewriting the rules.
— realme (@realmeIndia) December 23, 2024
With a design so unique and bold, it’s not just a device; it’s a masterpiece. This is what one of a kind truly looks like. #realme14ProSeries5G
Know more:https://t.co/ILXGh5heM3 pic.twitter.com/0DneOPHLD2
'రియల్‌మీ 14 ప్రో' సిరీస్ కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ మరికొన్ని రోజుల్లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మొబైల్ డిజైన్, ఫీచర్లు, కలర్ ఆప్షన్లను కంపెనీ రివీల్ చేసింది. ఈ 'రియల్‌మీ 14 ప్రో' సిరీస్ IP69 రేటింగ్‌తో రానుంది.
Itel Geno 10: ఇండియన్ మార్కెట్లోకి త్వరలో 'Itel Geno 10' స్మార్ట్‌ఫోన్ రానుంది. ఈ ఫోన్ మైక్రోసైట్ అమెజాన్‌లో ఇప్పటికే లైవ్ అవుతోంది. ఐటెల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 2025లో లాంఛ్ చేయనుంది. అయితే దీని ప్రారంభ ధర, లాంఛ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ ఫోన్ ప్రారంభ ధర ఎంత ఉంటుంది అంటే..? 6,000 కంటే తక్కువ ఉండొచ్చని టెక్ వర్గాల సమాచారం.
ఇది జెనిటల్ డిజైన్‌తో.. స్క్వేర్- షేప్డ్ కెమెరా మాడ్యూల్తో వస్తుంది. వీటితో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియల్ కెమెరా సెటప్‌తో రానుంది. ఈ ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో అచ్చం ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ మాదిరిగా నాచ్‌తో వస్తుంది. ఈ Gen Z-Focus ఫోన్‌లో 5000mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది.
హైబ్రిడ్ ఇంజిన్, కొత్త డిజైన్‌తో.. కియా సెల్టోస్ వచ్చేస్తోంది!- రిలీజ్ ఎప్పుడంటే?
నో సబ్స్క్రిప్షన్: 'యాపిల్ TV+'లో ఫ్రీ స్ట్రీమింగ్- న్యూఇయర్ ఆఫర్ అదిరిందిగా!