Actress Entry After 15 Years : సినిమా ఇండస్ట్రీలో కొందరి కెరీర్ ఒక్క సినిమాతో మారిపోతుంది. అద్భుత అవకాశాలు తీసుకురావచ్చు లేదా తెరమరుగయ్యేలా చేయవచ్చు. ఇదే పరిస్థితి బాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌కు ఎదురైంది. దాదాపు 15 ఏళ్లు మరో సినిమా చేయలేకపోయింది. ఇంతకాలానికి మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఆమెవరో కాదు బార్బరా మోరీ.
ఆమె 2010లో వచ్చిన హృతిక్ రోషన్ మూవీ కైట్స్తో అరంగేట్రం చేసింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలవడంతో బాలీవుడ్‌కు దూరమైపోయింది. ఇటీవలే మోరీ నటించిన బాలీవుడ్ మూవీ లూకాస్ వరల్డ్ రిలీజ్ అయింది. 2025 జనవరి 31న నెట్‌ఫ్లిక్స్ ప్రీమియర్‌గా వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉందని, నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని చెప్పింది.
బార్బరా మోరీ లూకాస్ వరల్డ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నేను స్క్రిప్ట్ చదవగానే ఏడవడం మొదలు పెట్టాను. అలాంటి పాత్రలో నటించడానికి నన్ను ఎంపిక చేశారంటే నమ్మలేకపోతున్నాను. ఈ కథ నిజంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అలాంటి అంగ వైకల్యంతో ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి మెక్సికోలో తగినన్ని సౌకర్యాలు లేవు. ఈ సమస్య ఎవరికైనా ఎదురవుతుందనే ఆలోచనే చాలా హృదయ విదారకంగా అనిపించింది. నిజమైన, జీవించి ఉన్న వ్యక్తి కథను చెప్పడం చాలా పెద్ద బాధ్యత. ఇది పోరాటం, ఆశకి సాక్ష్యం. ప్రజలకు ఎంతో స్ఫూర్తి నిస్తుంది. ఇందులో నేను భాగమైనందుకు నిజంగా గౌరవంగా భావిస్తున్నా" అని తెలిపింది.
హృతిక్‌తో ఎఫైర్?
కైట్స్ సినిమా షూటింగ్ సమయంలో, బార్బరా, హృతిక్ మధ్య ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. కానీ అది నిజమో కాదో ఎవరూ ధ్రువీకరించలేదు. హృతిక్ ఆమెకు చాలా విలువై బహుమతులు ఇచ్చినట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. చివరకుఆమెకు అదే బాలీవుడ్‌లో మొదటి, చివరి సినిమా అయింది. హృతిక్ చివరిసారిగా 2024లో విడుదలైన ఫైటర్‌లో కనిపించారు. 2025 ఆగస్ట్ 14న వార్ 2తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.