North vs South Movies : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం నార్త్ వెర్సెస్ సౌత్ (North Vs South) అంశం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ మీడియాతో రీసెంట్గా చిట్‌చాట్‌లో పాల్గొన్న టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ వ్యాఖ్యలకు కొందకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే ఇంటర్వ్యూలో ఆయన నార్త్ వర్సెస్ సౌత్ అంశంపై కూడా మాట్లాడారు. 'దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉంది. తెలుగు చిత్రాలకు యూఎస్, తమిళ మూవీలకు సింగపూర్, మలేషియా, గల్ఫ్‌లో మార్కెట్ బాగుంటుంది' అని ఆయన పేర్కొన్నారు. అయితే నాగవంశీ కామెంట్స్‌పై బాలీవుడ్ నిర్మాతలు స్పందిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై 'స్ర్తీ 2' నిర్మాత దినేశ్ మాట్లాడారు.
ఇండస్ట్రీ ఏదైనా ఆడియెన్స్‌కు ఎంటర్టైన్మెంట్ అందించడమే ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఈ క్రమంలో నార్త్, సౌత్ రెండు ఇండస్ట్రీలు విజయవంతమైన చిత్రాలను అందిస్తున్నాయన్నారు. 'కొవిడ్ తర్వాత బాలీవుడ్ మంచి విజయాలను సాధిస్తోంది. 'యానిమల్', 'గదర్ 2', 'పఠాన్', 'స్త్రీ 2' సినిమాలు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. సినీ పరిశ్రమ అంటేనే ప్రేక్షకులకు వినోదం పంచడం. సౌత్, నార్త్ అంటూ వేర్వేరుగా చూడొద్దు. అవన్నీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భాగమని గుర్తించాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో విడుదలైన సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి. రెండు ఇండస్ట్రీలు విజయాలు సాధించినప్పటికీ, రెండింటిలో ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయిన సినిమాలు కూడా ఉన్నాయని గమనించాలి' దినేశ్ రీసెంట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు
మరోవైపు నిర్మాత నాగవంశీ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. బోనీ కపూర్ అంటే తనకెంతో గౌరవమని అన్నారు. 'పెద్దలను ఎలా గౌరవించాలో మీరు నేర్పాల్సిన అవసరం లేదు. మీకంటే ఎక్కువగా మేము బోనీ కపూర్‌ను గౌరవిస్తాం. ఆయనను అగౌరవపరిచేలా నేను అలా మాట్లాడలేదు. ఇది ఆరోగ్యకరమైన చర్చ. మేమిద్దరం చక్కగా నవ్వుతూ మాట్లాడుకున్నాం. ఇంటర్వ్యూ తర్వాత హగ్ చేసుకున్నాం కూడా. దయచేసి మీరు ఇలాంటివి చూసి ఒక ఆలోచనకు రాకండి' అని పేర్కొన్నారు.
'డాకు మహారాజ్' కోసం మూడు భారీ ఈవెంట్‌లను ప్లాన్ చేశాం : నిర్మాత నాగవంశీ
'నన్ను క్షమించండి - NBK 109 టైటిల్ అప్డేట్ అందుకే ఇవ్వలేకపోయాం' : నాగవంశీ