Daaku Maharaaj Trailer : నందమూరి నటసింహం బాలకృష్ణ- స్టార్ డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. 2025 సంక్రాంతి సందర్భంగా జవవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక్కో పాట రిలీజ్ చేస్తున్నారు. గురువారం మరో పాట విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ నాగవంశీ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అమెరికాకు షిఫ్ట్ చేస్తున్నట్లు తాజాగా పేర్కొన్నారు.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి 2న హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, జనవరి 4న అమెరికాలో ఇంకో ఈవెంట్, జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే అభిమానుల కోరిక మేరకు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాకు మారుస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ ట్రైలర్ ఫుల్ మాస్‌గా ఉంటుందని అన్నారు.
'ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అమెరికాకు షిఫ్ట్ చేస్తున్నాం. ట్రైలర్ ఫుల్ మెంటల్ మాస్‌గా ఉండనుంది. ప్రతి షాట్ కిక్ ఇస్తుంది. ఇక మీరంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 'దబిడి', 'దిబిడి' పాటను రేపు విడుదల చేయనున్నాం' అని నాగవంశీ పోస్ట్ షేర్ చేశారు. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న నిర్వహించనున్నారు.
On fans’ demand, we’ve decided to shift the #DaakuMaharaaj Trailer Launch to the USA.
— Naga Vamsi (@vamsi84) January 1, 2025
You will witness the most whistle worthy and Mental Mass Trailer ever worth every moment of the high it gives!!
To keep the excitement going we’ve decided to release the much awaited MASS… pic.twitter.com/83f6qEML5f
కాగా, రీసెంట్గా ప్రెస్మీట్లో పాల్గొన్న నిర్మాత నాగవంశీ సినిమాపై మాట్లాడుతూ అంచనాలు అమాంతం పెంచేశారు. గత 20-30 ఏళ్లలో ఎన్నడూ కనిపించనంత కొత్తగా బాలయ్య ఈ సినిమాలో కనిపిస్తారని అన్నారు. ఆయన కెరీర్లో డాకూ మహారాజ్ ఎప్పటికీ నిలిచిపోయే సినిమా కానుందని పేర్కొన్నారు. ఇది వర్త్ వెయిటింగ్ (Worth Waiting) సినిమా అని అన్నారు.
ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ఉన్న ఈ టీజర్‌కు మ్యాసివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిచగా, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.