2025 January Release Movies : 2024 ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. అయితే సినిమాల పరంగా ఎన్నో మర్చిపోలేని మూమెంట్స్‌ను అందించింది. పలు హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది. అయితే ఈ కొత్త ఏడాది కూడా అదే జోరు మీద బాక్సాఫీస్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. తొలి నెలలోనే ఎన్నో కొత్త చిత్రలతో థియేటర్లలో సందడి చేయనునుంది. మరి జనవరిలో బాక్సాఫీసు ముందుకు రానున్న చిత్రాలేవో ఈ స్టోరీలో చూసేద్దామా.
మలయాళ, తమిళ సినిమాలతో ఫస్ట్ వీక్!
కొత్త ఏడాది తొలి వారంలో తెలుగు సినిమాలేవీ రిలీజ్‌కు సిద్ధం కాలేదు. అయితే 'మార్కో' అనే సినిమా మాత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. 'జనతా గ్యారేజ్', 'భాగమతి'తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో నటించారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు తెలుగువారిని అలరించేందుకు జనవరి 1న రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉండగా, టొవినో థామస్, త్రిష లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన 'ఐడెంటిటీ' కూడా మలయాళ, తమిళ భాషల్లో ఈ నెల 2న విడుదల కానుంది.
సంక్రాంతి రేసులో అగ్ర తారలు
ఎప్పటిలానే ఈ సారి కూడా సంక్రాంతికి బరిలో అగ్ర తారల సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. బాలకృష్ణ, వెంకటేశ్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలూ ఈ పోరులో నిలవనున్నాయి. ముఖ్యంగా రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'పై తెలుగు అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.
Wishing you all a very Happy and Prosperous New Year! ❤️
— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024
The #GameChanger month begins see you at the cinemas on
10.01.2025! ❤️🔥💥 pic.twitter.com/2TAHMrXxSk
గతేడాది 'వీరసింహారెడ్డి'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య ఈ సారి 'డాకు మహారాజ్'గా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని లుక్‌లో బాలకృష్ణ కనిపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ఆడియన్స్‌లో సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించింది. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది.
'సంక్రాంతి వస్తున్నాం' అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యారు టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్. యాక్షన్ అలాగే కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం జనవరి 14న రానుంది.
డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ డైరెక్ట్ చేసి నటించిన 'ఎమర్జెన్సీ' మూవీ జనవరి 17న విడుదల కానుంది. ఇక సోనూసూద్ కూడా తాజాగా మెగా ఫోన్ పట్టి 'ఫతేహ్' అనే చిత్రాన్ని రూపొందించారు. ఇది జనవరి 10న థియేటర్లలోకి రానుంది. 77వ కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'సంతోశ్' కూడా ఇదే రోజున విడుదల కానుంది.
ఆఖరిలో మెరుపులు!
భారత్‌లో జరిగిన మొదటి వైమానిక దాడి ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'స్కై ఫోర్స్'. అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో మెరిసిన ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 24న విడుదల కానుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక సన్నీ దేవోల్, ప్రీతి జింటా మెయిన్ లీడ్స్‌గా రాజ్‌కుమార్ సంతోషి తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ 'లాహోర్ 1947' సైతం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానుందని సమాచారం. షాహిద్ కపూర్ 'దేవ' మూవీ జనవరి 31న విడుదల కానుంది.
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న అజిత్ మూవీ - నిరాశలో ఫ్యాన్స్!
2024లో మాలీవుడ్‌కు భారీ లాస్- 199 చిత్రాల్లో 26 మాత్రమే హిట్- మిగతావన్నీ ఫట్!