Actress Keerthy Suresh Marriage :కోలీవుడ్ బ్యూటీకీర్తి సురేశ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీతో ఆమె డిసెంబర్ 11న గోవాలో వివాహం చేసుకోనున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై తాజాగా కీర్తి తండ్రి సురేశ్ మాట్లాడారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన తన కుమార్తె పెళ్లి గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. "నవంబర్ 25న కీర్తి సురేష్ వివాహం గురించి అధికారికంగా ప్రకటించనున్నాం" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వార్త నిజమే అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ
కీర్తి సురేశ్ పెళ్లి గురించి రూమర్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేక మార్లు ఈ బ్యూటీ మ్యారేజ్‌పై రూమర్స్ వచ్చాయి. బిజినెస్ మ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత ఇలా ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే తమ కూతురి పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేశ్ తల్లిదండ్రులు అప్పట్లో ఖండించారు. అలాగే తన ప్రేమ, పెళ్లిపై గతంలోనూ కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి కీర్తి పెళ్లి రూమర్స్ తెరపైకి వచ్చాయి. వాళ్లిద్దరిది 16ఏళ్ల ప్రేమ బంధం అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ జంట డిసెంబరు 11న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని సమాచారం.