తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బస్సు ప్రమాదం కారణంగా 'కాంతార' మేకర్స్ కీలక నిర్ణయం! - షూట్‌ నిలిపివేత! - KANTARA CHAPTER 1 SHOOTING

బస్సు ప్రమాదంలో గాయపడ్డ నటీనటులు - 'కాంతార చాప్టర్‌ 1' షూట్‌ నిలిపివేత!

KANTARA CHAPTER 1 SHOOTING
Rishab Shetty (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 5:33 PM IST

Kantara Chapter 1 Shooting : కన్నడ స్టార్ హీరో రిషభ్‌ శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాంతార చాప్టర్‌ 1' షూటింగ్​కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలె జరిగిన ప్రమాదం కారణంగా సోమవారం ఈ సినిమా చిత్రీకరణ నిలిపివేసినట్లు సినీ వర్గాల సమచారాం. నటీనటులకు చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే టీమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏం జరిగిందంటే?
'కాంతార' ప్రీక్వెల్​ కోసంఆదివారం రాత్రి షూట్‌ పూర్తి చేసుకుని చిత్రబృందంలోని 20 మంది సభ్యులు ఓ మినీ బస్సులో జడ్కల్‌ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆ సమయంలోనే తాము వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జూనియర్‌ ఆర్టిస్టులు గాయపడ్డారట. ఈ సమాచారం అందుకున్న కొల్లూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

"జడ్కల్‌లోని మూడూరులో షూటింగ్‌ ముగించుకుని కొల్లూరుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో దాదాపు 20 మంది బస్సులో ఉన్నారు" అని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే షూట్‌ నిలిపివేసినట్లు కూడా తాజాగా కథనాలు ప్రచురితమవుతున్నాయి.

ఇక 'కాంతర' సినిమా విషయానికి వస్తే, సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్​లో మంచి టాక్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్లింది. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్‌ 1' సిద్ధమవుతోంది. స్టార్ హీరో రిషభ్‌ శెట్టి తన సొంత డైరెక్షన్​లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో జయరామ్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపందనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రిషబ్‌ కలరిపయట్టు యుద్ధ విద్యలో గత కొన్నాళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. అంతేకాకుండా తన లుక్స్​పై కూడా కాన్సన్​ట్రేట్ చేస్తున్నారు. 2025 అక్టోబర్‌ 2న దీనిని విడుదల చేయాలనుకుంటున్నామని ఇప్పటికే టీమ్‌ ప్రకటించింది.

'కాంతార' మూవీ టీమ్ బస్సు బోల్తా - 20 మందికి గాయాలు

ఆ డైరెక్టర్ దెబ్బకు సినిమాలే వద్దనుకున్నారు - ఇప్పుడేమో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు - Best Actor Rishab Shetty

ABOUT THE AUTHOR

...view details