Janvi Kapoor Rajkummar Rao :హీరోయిన్జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులోనూ వరుసగా స్టార్ హీరోల చిత్రాలను లైన్లో పెడుతోంది. అయితే తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ హీరో పళ్లను పగులగొట్టింది!
అసలేం జరిగిందంటే? -జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన Mr & Mrs మహీ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. దీన్ని జాన్వి, రాజ్ కుమార్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా ప్రమోషన్స్ కోసం ఓ సరదా వీడియోను చేశారు. ఈ వీడియోలో జాన్వీ తడబడుతూనే బ్యాట్ పట్టుకుంది. రాజ్ కుమార్ ఏం పర్లేదు అంటూ బంతిని సంధించాడు. బ్యాట్‌తో బాల్‌ను బలంగా ఒక షాట్ కొట్టింది జాన్వీ. ఆ బాల్ సరాసరి రాజ్ కుమార్ పెదాల మీద తగిలి పళ్లు ఊడాయి. బాధతో విలవిలలాడాడు రాజ్‌కుమార్. అలా హీరో పళ్లను పగులకొట్టింది జాన్వీ. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.