Jai HanuMan Shoot Postpone :సంక్రాంతి రేసులో పెద్ద బడ్జెట్ సినిమాలతో పోటీపడి మరీ రిలీజై రికార్డులు అన్ని తిరగరాసి సూపర్ హిట్ అయింది హనుమాన్. ఈ పాన్ ఇండియా హిట్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాప్ డైరెక్టర్ల రేసులోకి వెళ్లాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు కలెక్షన్స్ సాధించింది. అయితే హనుమాన్ సినిమా చివర్లో జై హనుమాన్ 2025లో విడుదల అవుతుందని ప్రకటించారు ప్రశాంత్ వర్మ.
దీంతో ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సినిమా జై హనుమానే ఉంటుందని అంతా ఆశించారు. కానీ అది కాదని తెలుస్తోంది. జై హనుమాన్ షూటింగ్ కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో తన పాత పెండింగ్ ఉన్న చిత్రంపై ఫోకస్ పెట్టారట ప్రశాంత్. ఇప్పటికే 65 శాతం పూర్తి చేసిన ఆక్టోపస్ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Prasanth Varma Anupama Parameshwaran :ఆక్టోపస్ సినిమా ప్రశాంత్ వర్మ మార్క్ సినిమాలలాగా ఉండదని, ఇది పూర్తిగా మహిళా ప్రాధాన్యత చిత్రం అని తెలుస్తోంది. ఇందులో ఐదు మహిళా ప్రధాన పాత్రలు ఉంటాయని ఆ మధ్య తెలిపారు ప్రశాంత్ వర్మ. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఐదుగురు మహిళలు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయినప్పుడు ఏమి జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. అయితే ఈ సినిమాను మొదటగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపించిన తర్వాత థియేటర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు చిన్న బడ్జెట్‌తో వివిధ జానర్ సినిమాలతో పెద్ద హిట్లు కొట్టిన ప్రశాంత్ వర్మ ఈ లేడి ఓరియెంటెడ్ సినిమాతో ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటారో చూడాలి.