Janvhi Kapoor Naga Chaitanya Movie : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పలువురు తెలుగు దర్శకనిర్మాతలు కూడా జాన్వీతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ 'దేవర' చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దేవర మూవీ సెట్స్‌పై ఉన్నప్పుడే తన నెక్స్ట్ తెలుగు చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేసేందుకు ఓకే చెప్పింది. అయితే, ఇప్పుడు ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది.
ఆ ప్రాజెక్ట్ ఏంటంటే? -జాన్వీ కపూర్ అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. చైతూ ప్రస్తుతం నటిస్తున్న తండేల్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంతో ఎలాగైనా పెద్ద సాలిడ్ హిట్ అందుకోవాలని నాగ చైతన్య శ్రమిస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత ఓ సింపుల్ లవ్ స్టోరీలో నటించాలని చైతూ అనుకుంటున్నారట. దర్శకుడు శివ నిర్వాణ దీన్ని తెరకెక్కిస్తారని, ఇప్పటికే ఓ కథను సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసమే హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాలని శివ నిర్వాణ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో నాగ చైతన్యతో కలిసి శివ నిర్వాణ బ్లాక్ బస్టర్ హిట్ మజిలీని తెరకెక్కించారు. చూడాలి మరి ఈ కాంబోలో సినిమా సెట్ అవుతుందా? ఒకవేళ సెట్ అయితే అందులో జాన్వీ నటిస్తుందా? అనేది.