Bigg Boss 8 Telugu Grand Finale Chief Guest: ప్రముఖ రియాల్టీ షో.. బిగ్‌బాస్ సీజన్ -8కు అతి త్వరలో శుభం కార్డ్ పడబోతోంది. ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ మొదలైన ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 15వ తేదీనగ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ క్రమంలో ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా ఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన హీరో రాబోతున్నారని సోషల్ మీడియా కోడైకూస్తోంది. ఆయన ఎవరు అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
సెప్టెంబర్ 1వ తేదీన మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా.. బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వాళ్లని క్లాన్స్‌గా కలిపి గేమ్ ఆడించిన బిగ్‌బాస్.. ఆ తర్వాత వైల్డ్‌కార్డ్ పేరుతో 8 మందిని హౌజ్‌లోకి పంపించారు. హౌజ్‌మేట్స్ వర్సెస్ వైల్డ్‌కార్డ్స్ అన్నట్టుగా పలు గేమ్స్ పెట్టి, నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చారు. ఆ తర్వాత అందరినీ కలిపేసి ఒకే టీమ్ చేసి కంటెండర్ పోటీలు పెట్టారు. దీంతో హౌజ్‌మేట్స్ మధ్య లెక్కలు మారుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే షో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 17 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యి.. ప్రస్తుతం హౌజ్‌లో టాప్ 5 ఫైనలిస్టులు అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ మాత్రమే మిగిలారు. ఈ ఐదుగురిలో ఒకరు డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రోజు జరగబోయే గ్రాండ్ ఫినాలేలో ట్రోఫీ తీసుకోనున్నారు. వీరిలో ఒకరికి ముఖ్య అతిథి చేతులు మీదుగా ట్రోఫీ అందజేయనున్నారు.
ఇక బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ప్రతిసారి ఒక సెలబ్రెటీ గెస్ట్ రావడం కామన్. గెలిచిన వారు ఆ సెలబ్రిటీ చేతుల మీదుగా ట్రోపీ, ప్రైజ్‌మనీ అందుకుంటారు. అయితే లాస్ట్ సీజన్ 7కు మాత్రం ఎవరు అతిథిగా రాలేదు. హోస్ట్ నాగార్జునే విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ట్రోఫీ అందించారు. ఈసారి సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారనే టాక్ నెట్టింట జోరుగా నడుస్తోంది. ఇప్పటికే పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ 1000 కోట్ల క్లబ్లో చేరింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్ అతిథిగా వస్తున్నారంటే అటు హీరో ఫ్యాన్స్‌కు, ఇటు బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు పండగ అన్నట్లే.