తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

త్రిష 'ఐడెంటిటీ' క్లోజ్ - Trisha Identity Movie - TRISHA IDENTITY MOVIE

TRISHA IDENTITY MOVIE : గతేడాది లియో చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది స్టార్ హీరోయిన్ త్రిష. అయితే తాజాాగా ఆమె ఐడెంటిటీ క్లోజ్ అయింది. అర్థం కాలేదా? తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదివేయండి. Source ETV Bharat

Source ETV Bharat
TRISHA (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 9:31 AM IST

TRISHA IDENTITY MOVIE : గతేడాది లియో చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది స్టార్ హీరోయిన్ త్రిష. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటున్న ఈ భామ ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో గ్యాప్ లేకుండా నటిస్తోంది. అలా ఆమె మలయాళ స్టార్ హీరో టోవినో థామస్​తో కలిసి ఐడెంటిటీ అనే సినిమా చేస్తోంది.

అఖిల్‌ పాల్‌, అనాస్‌ఖాన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను కంప్లీట్ చేసుకుంది త్రిష. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసుకుంది మూవీటీమ్​. "ఐడెంటిటీ చిత్రంలో త్రిష పాత్ర షూటింగ్ ముగిసింది. ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ కూడా ఆమె మా ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. మా మీద నమ్మకం ఉంచి మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు" అని రాసుకొచ్చింది. కాగా, క్రైమ్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్​తో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్​ను త్వరలో ప్రకటించనుంది మూవీటీమ్​.

Trisha Upcoming Movies : ఇకపోతే ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్డార్ చిరంజీవితో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. అలానే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ థగ్‌ లైఫ్​తో పాటు విదాముయార్చి సహా పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇవ్వన్నీ కూడా త్వరలోనే థియేటర్లలో విడుదల కానున్నాయి.

బాలీవుడ్​లో మరో సినిమా - త్రిష బాలీవుడ్​లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో 2014లో విడుదలైన కామెడీ చిత్రం కట్టా-మీటాలో నటించింది. ఆ తర్వాత మరో హిందీ చిత్రంలో నటించలేదు. మళ్లీ ఇప్పుడు మరో సినిమా చేయనుందట. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా సికందర్​లో రష్మికతో పాటు త్రిష కూడా నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఏఆర్ మురుగదాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్​మెంట్​ వచ్చే ఛాన్స్ ఉంది.

విడాకులు తీసుకున్న మరో స్టార్​ సెలబ్రిటీ కపుల్ - 11ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి - GV Prakash Divorce

మరో హాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్​ కొట్టేసిన టబు - Tabu Hollywood Film

ABOUT THE AUTHOR

...view details