Kriti Sanon Alibaug property : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. 'వన్- నేనొక్కడినే', 'దోచెయ్' వంటి చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్‌ను అలరించిన ఈమె చివరగా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో నటించి మెప్పించింది. తన మెస్మరైజ్ పెర్ఫార్మెన్స్, అదిరిపోయే స్టైల్, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆన్‌స్క్రీన్ చరీష్మాతో పాటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ అంతే ఇంప్రెసివ్‌గా హుందాగా ఉంటుంది.
యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్‌గానూ రాణిస్తోంది కృతి. అలానే తన సంపాదనను పెట్టుబడిగా పెట్టి ఇతర వ్యాపారాలను చేస్తోంది. ఫ్యాషన్ రంగంలో 'మిస్ టేకెన్', ఫిట్నెస్ రంగంలో 'ది ట్రైబ్', నిర్మాణ రంగంలో 'బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్'లతో పాటు సౌందర్య రంగంలో 'హైఫెన్' లాంటి వ్యాపారాల్లో రాణిస్తూ కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇక ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతోందని తెలిసింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు తెలిసింది. కృతిసనన్‌కు ఇప్పటికే బెంగళూరులో ఓ కమర్షియల్ స్పేస్, గోవాలో ఓ లగ్జరీ విల్లా ఉన్నాయట. ఇప్పుడు ముంబయి మెట్రోపొలిటన్ రీజన్, సెలబ్రిటీలు ఉండే అలీబాగ్‌లో ఓ ప్రాపర్టీని కొనుగోలు చేసిందట. 2000వేల స్క్వేర్ ఫీట్ ప్లాట్‌ను తీసుకుందట. ఇందులో గ్రీనరీ, అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయట. దీని విలువ రూ.2 కోట్లకుపైనే ఉంటుందని అంటున్నారు.