తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బుజ్జితల్లి ఫ్యాన్స్‌కు 'తండేల్' టీమ్ సర్​ప్రైజ్​ వీడియో - Happy Birthday Sai pallavi

Happy Birthday Sai pallavi Thandel Movie : సాయి పల్లవి ఈ ముద్దుగుమ్మకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నేచురాలిటికీ కేరాఫ్​ అడ్రెస్ అయిన ఈ భామ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా బర్త్​ డే విషెస్ తెలుపుతూ తండేల్ టీమ్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

ETV Bharat
Saipallavi (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 9:35 AM IST

Updated : May 9, 2024, 10:14 AM IST

Happy Birthday Sai pallavi Thandel Movie : సాయిపల్లవి ఈ ముద్దుగుమ్మకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నేచురాలిటికీ కేరాఫ్​ అడ్రెస్. సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అయితే నేడు ఈ భామ పుట్టినరోజు సందర్భంగా బర్త్​ డే విషెస్ తెలుపుతూ తండేల్ టీమ్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో ప్రేమమ్, ఫిదా, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్, మారి 2 సహా సాయి పల్లవి నటించిన పలు చిత్రాలలోని పాత్రలను చూపిస్తూ చివరిగా తండేల్​ చిత్రంలోని బుజ్జి తల్లి పాత్రను చూపించారు. తండేల్ షూటింగ్​ సమయంలో సాయిపల్లవిపై చిత్రీకరించిన సన్నివేశాలను చూపించారు. అలాగే బుజ్జి తల్లి చిత్రీకరణ సమయంలో చుట్టూ ఉన్న వారితో ఎలా ఉంటుందో కూడా చూపించారు.

కాగా, ఈ చిత్రంలో సాయిపల్లవి బుజ్జితల్లిగా సందడి చేయనుంది. హీరో నాగచైతన్య జాలరి పాత్రలో కనిపించనుండగా సాయిపల్లవి ఆయనతో కలిసి అల్లరి చేయనుంది. ఇప్పటికే పుట్టినరోజు సందర్భంగా సాగర తీరాన కూర్చుని నవ్వుతూ ఫోన్‌లో మాట్లాడుతున్న సాయి పల్లవి లుక్​ను విడుదల చేయగా ఫ్యాన్స్​ను బాగా ఆకట్టుకుంది.

ల‌వ్ స్టోరీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌స్తోన్న ఈ రెండో చిత్రానికి చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్​పై రూపొందుతోంది. బన్నీ వాస్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో -సముద్రంలోచేప‌ల వేట‌కు వెళ్లిన ఓ యువకుడు(నాగ చైతన్య) అనుకోకుండా దేశ స‌రిహ‌ద్దులు దాటి పాకిస్థాన్ సైన్యానికి బందీగా ఎలా చిక్కాడు? అక్కడి చెరసాల నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో అత‌డికి ఎలాంటి పరిస్థితులు ఎదుర‌య్యాయి? మరి దాయాది దేశానికి చిక్కిన త‌న ప్రియుడిని కాపాడుకోవ‌డానికి ఓ యువ‌తి(సాయిపల్లవి) ఎలాంటి సాహ‌సం చేయడానికి సిద్ధ‌ప‌డింద‌ి అనే కథాంశంతో తండేల్‌ తెర‌కెక్కుతున్న‌ట్లు సమాచారం అందింది. 2024 డిసెంబ‌ర్ 20న ఈ చిత్రం థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

కాలేజీ ఫెస్ట్​లో 'షీలా కీ జవానీ' సాంగ్​కు సాయిపల్లవి డ్యాన్స్​ - స్టేజ్ షేకే! - Saipallavi Sheila Ki jawani Dance

తండ్రి అడిగిన ఆ ఒక్క ప్రశ్న - రౌడీహీరోను సినిమాల్లోకి వెళ్లేలా చేసిందట! - Happy Birthday Vijay Devarkonda

Last Updated : May 9, 2024, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details