తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విజయ్ కోసం ఈ ఇద్దరిలో ఎవరు ఓకే చెబుతారో? - Gowtam Tinnanuri Vijay Devarakonda - GOWTAM TINNANURI VIJAY DEVARAKONDA

Gowtam Tinnanuri Vijay Devarakonda Movie Heroine : విజయ్ దేవరకొండ - గౌతమ్​ తిన్ననూరి కాంబోలో పట్టాలెక్కబోయే సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయమై కొత్త ప్రచారం మొదలైంది. ఆ వివరాలు.

విజయ్ సరసన ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్లో ఎవరో?
విజయ్ సరసన ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్లో ఎవరో?

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 4:35 PM IST

Gowtam Tinnanuri Vijay Devarakonda Movie Heroine :రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలిసిందే. ఈ మధ్యనే ది ఫ్యామిలీ స్టార్ అనే కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా నటించింది.

అయితే ఏప్రిల్ 5న రిలీజైన ఈ సినిమా మిక్స్​డ్​ టాక్ తెచ్చుకుంది. కొంతమంది బాగుందని రివ్యూలు ఇస్తుంటే మరికొంతమంది నెగటివ్​ రివ్యూలను భారీగా పోస్ట్​ చేస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్​ గురించి పక్కన పెడితే దేవరకొండ నెక్ట్స్​ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​లో ఇది తెరకెక్కనుంది.

ఇప్పుడీ సినిమాలో నటించబోయే హీరోయిన్​ ఎవరనే విషయమై ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ కథానాయిక మరెవరో కాదు ఈ మధ్యనే ప్రేమలు అనే మలయాళ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిని కూడా దోచిన ముద్దుగుమ్మ మమితా బైజు(Premalu Movie Heroine). ఈ మలయాళ భామ ఇప్పటికే తమ సొంత భాషలో పలు సినిమాలు చేసింది. కానీ ప్రేమలు చిత్రంతో మస్త్ క్రేజ్ సంపాదించుకుంది. దీన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ కూడా ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు.

ఇప్పుడీ ముద్దుగుమ్మనే విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్​గా నటించేందుకు సెలెక్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూవీ టీమ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. దాదాపుగా ఆమెను ఫిక్స్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఆమె మిస్ అయితే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్​గా(Mr.Bachan Heroine Bhagyashriiborse) నటిస్తున్న భాగ్యలక్ష్మి బోర్సేను తీసుకోవాలని కూడా అనుకుంటున్నారట. ఈమె కూడా తన మిస్టర్ బచ్చన్​ చిత్రం రిలీజ్​ అవ్వకముందే తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలా ఈ ఇద్దరు భామల్లో ఒకరిని హీరోయిన్​గా దాదాపుగా కన్ఫామ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంతో.

రాజమౌళి - మహేశ్​ సినిమాలో మరో స్టార్ హీరో? - Rajamouli Mahesh Babu Movie

'దేవర' రిలీజ్ ఆలస్యమైనా మీరందరూ కాలర్ ఎగరేస్తారు'- ఫ్యాన్స్​లో జోష్ నింపిన ఎన్టీఆర్ - Jr NTR Devara

ABOUT THE AUTHOR

...view details