Genelia Deshmukh Love Story :హా హా హా హాసినీ అంటూ తన అమయాక్వతంతో ప్రేక్షకులను కట్టిపడేసింది బాలీవుడ్ బ్యూటీ జెనీలియా. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన ఈ అమ్మడు 'ఢీ', 'రెడీ', 'సై' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్‌కు మరింత చేరువైంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జెనీలియా, నెమ్మదిగా బీటౌన్‌కు షిష్ట్ అయ్యి అక్కడి ప్రేక్షకులను అలరించింది. అయితే అక్కడ తనకు పరిచమైన బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇంతకీ ఈ జంట ఎలా మీట్ అయ్యిందంటే ?
జెనీలియా, రితేశ్‌లు బాలీవుడ్‌కు పరిచయమైంది ఒకే సినిమాతో. 2003లో రిలీజ్ అయిన 'తుజే మేరీ కసమ్' అనే సినిమానే వీరి పరిచయానికి నాంది. షూటింగ్ సమయంలో తొలిసారి రితేశ్‌ను చూనినప్పుడు అతణ్ని చూసి వట్టి పొగరుబోతు అనుకునేదట. రితేశ్ కూడా ఆమె డిఫరెంట్‌గా ఉందని దూరంగా ఉండేవారట.
అలా షూటింగ్ ఆరంభ సమయంలో ఒకరినొకరు పట్టించుకోని ఈ జంట సినిమా పూర్తయ్యేసరికి మంచి ఫ్రెండ్స్ అయిపోయారట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. దీంతో రితేశ్ మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూట్ యాక్టర్ అవార్డుకు నామినేట్ అయితే, జెనీలియా మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూట్ యాక్టరస్ కేటగిరీకి నామినేట్ అయింది.
ఇక తొలి సినిమా తర్వాత వారి ఫ్రెండ్‌షిప్ కొనసాగింది. ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు దాపరికాలు లేకుండా షేర్ చేసుకునేంత దూరం వెళ్లారు. అలా 2004లో వీరి కాంబినేషన్లో మరో కామెడీ సినిమా రిలీజ్ అయి హిట్ అయింది. ఆ తర్వాత ఇద్దరూ కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. ఒక ఇంటర్వ్యూలో "మేం ప్రేమించుకునే రోజుల్లో వీడియో కాల్స్, మామూలు కాల్స్, మెసేజ్‌లు చేసుకోవడం చాలా ఖరీదైన పని. తనేమో సౌత్‌లో ఎక్కువ సినిమా షూటింగుల్లో ఉండేది. నేనేమో యూఎస్‌లో షూటింగ్ చేస్తూ ఉండేవాడిని. అందుకని మా కమ్యూనికేషన్ దాదాపు ఉత్తరాల్లోనే జరిగేది. ప్రతి రోజూ ఉత్తరాలు రాసుకుంటూ నెల తర్వాత కలుసుకునేవాళ్లం. అలా 30 లెటర్స్ ఒకేసారి ఇచ్చిపుచ్చుకునేవాళ్లం. అలా 30 రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకునేవాళ్లం" అని రితేశ్ వివరించారు.