తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్​ చెప్పిన తమన్ - SS Thaman Game Changer - SS THAMAN GAME CHANGER

SS Thaman Game Changer : చరణ్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చే న్యూస్ చెప్పారు మ్యూజిక్ డైరక్టర్ థమన్. గేమ్ ఛేంజర్ అప్‌డేట్ గురించి వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. అదేంటంటే?

SS Thaman Game Changer
SS Thaman Game Changer (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 9:35 PM IST

SS Thaman Game Changer :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పొలిటికల్ డ్రామా 'గేమ్ ఛేంజర్' పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో అప్‌డేట్ గురించి ఎదురుచూస్తున్నారు. వారందరినీ సర్ ప్రైజ్ చేసే న్యూస్ చెప్పారు మ్యూజిక్ డైరక్టర్ తమన్. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా "సెప్టెంబర్ 25న #GameChanger సినిమా గురించి కీలకమైన అప్‌డేట్ ఉంటుంది." అంటూ మంచి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు.

సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటిస్తున్నారు. తమన్ చేసిన ఈ పోస్టు ఫ్యాన్స్‌ను థ్రిల్లింగ్‌లో పడేసింది.

వరుస వాయిదాల తర్వాత సినిమా షూటింగ్‌ను మళ్లీ పట్టాలెక్కించినట్లు వార్తలు వినిపించాయి. శంకర్ చేతుల మీదుగా మొదలైన ఈ ప్రాజెక్టును ఎస్జే సూర్య పూర్తి చేస్తున్నారంటూ గాసిప్పులు వినిపించాయి. అదే నిజమైతే ఈ మూవీలో ఎస్జే సూర్య దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారన్న మాట. మరోవైపు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన లాంగ్ షాట్‌లను కూడా చిత్రీకరించారట. ఎస్జే సూర్యతో పాటుగా నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, అంజలి, ఇతరులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మెగా ప్రాజెక్టు హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కానుంది.

'జరగండి జరగండి' అనే పాట మినహాయించి ఒక్క అప్‌డేట్‌కు కూడా నోచుకోని 'గేమ్ ఛేంజర్' అంతగా ప్రచారం చేసుకోలేకపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న తొలి సినిమా ఇది. అటువైపు తారక్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాతో రెడీ అయిపోయాడు. ఇన్ని రోజులు మిస్ అయిన ప్రచారాన్ని ఫిల్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ కానుండగా మూవీ రిలీజ్ రోజునే థియేటర్స్‌లో గేమ్ ఛేంజర్‌కు సంబంధించి సెకండ్ సింగల్ ప్రదర్శించాలని అనుకుంటున్నారట. నిర్మాత దిల్ రాజు చెప్పిన దానిని బట్టి సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

ABOUT THE AUTHOR

...view details