Game Changer Ra Macha Macha :గ్లోబల్ స్టార్రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ 'రా మచ్చ మచ్చ' సోమవారం విడుదలైంది. ఈ పాటను లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ రాశారు. తమన్ సంగీతం అందించారు. పాటను పూర్తిగా వైజాగ్ ప్రాంతంలో చిత్రీకరించారు. భారీ సెటప్‌తో ఫుల్ కలర్ఫుల్గా సాంగ్ షూట్ చేశారు. ఇక పాటలో పూర్తిగా రామ్‌చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి 'వీణ స్టెప్'ను ఈ పాటలో రామ్‌చరణ్ చేశారు. మరి మీరు చెర్రీ డ్యాన్స్ చూశారా?
కాగా, 'రా మచ్చ మచ్చ' పాట ప్రోమో రిలీజ్ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు సినిమా గురించి సాలిడ్ అప్డేట్స్ వదిలారు. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్‌తో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ చిట్‌చాట్‌లో మెగా ఫ్యాన్స్‌కు అక్టోబర్‌లో ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సినిమా నుంచి మరో పాట, టీజర్ విడుదల చేయనున్నట్లు దిల్‌రాజు చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను 2024 క్రిస్మస్కు థియేటర్లలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు దిల్‌రాజు తెలిపారు. ఇకపై అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లో వరుసగా మూవీ ప్రమోషన్స్ చేస్తామని ఆయన అన్నారు.
సూర్య డ్యాన్స్