Sanju Samson Champions Trophy : 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్‌లను ప్రకటించాల్సిన సమయం దగ్గర పడుతోంది. అయితే మరోసారి టీమ్‌ఇండియాలో సంజు శాంసన్ స్థానంపై వివాదం మొదలైంది. భారత్ సహా మొత్తం ఎనిమిది జట్లు జనవరి 12లోగా తమ స్క్వాడ్‌లను ప్రకటించాల్సి ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి స్క్వాడ్‌ని ఎంపిక చేయడంలో భారత సెలెక్టర్లకు సవాలు ఎదురుకానుంది. ముఖ్యంగా చాలా మంది బ్యాటర్‌లు టీమ్‌లో ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. మరోసారి జట్టులో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ స్థానం అనిశ్చితంగా కనిపిస్తోంది.
ఇప్పటికే చాలా సార్లు సంజూ శాంసన్‌ని ఐసీసీ టోర్నమెంట్‌ల నుంచి పక్కనపెట్టారు. మరోసారి వేటు తప్పదని వస్తున్న వార్తలపై అతడి అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సంజూని ఎంపిక చేయాలని పోస్టులు చేస్తున్నారు.
కొన్ని మీడియా నివేదికల ప్రకారం, 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సంజూ శాంసన్‌ని పరిగణించకపోవచ్చు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ లేదా శ్రేయాస్ అయ్యర్ వంటి వారికి అవకాశం దక్కనుంది. దీంతో సంజు ఫ్యాన్స్ అతడి పేరును ఆన్‌లైన్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఇటీవల అతడి ప్రదర్శనలను హైలైట్ చేస్తున్నారు.
సంజు శాంసన్ పెర్ఫామెన్స్ ఎలా ఉందంటే?
ఇప్పటి వరకు 16 వన్డేల్లో 14 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో 510 పరుగులు చేశాడు. అంతేకాకుండా 37 టీ20 మ్యాచులలో 33 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో 810 పరుగులు చేశాడు. ఇటీవల టీ20 సిరీస్‌లో సంజూ వరుసగా రెండు సెంచరీలు బాదాడు. అద్భుత ప్రదర్శనతో టీమ్‌ని గెలిపించాడు. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీని కోల్పోవచ్చు.
టీమ్‌ఇండియా స్క్వాడ్‌లో ఎవరు ఉంటారంటే?
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్లుగా ఎంపిక చేయవచ్చు. మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటు దక్కే అవకాశం ఉంది. రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలను తీసుకుంటాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను కూడా ఎంపిక చేయవచ్చు. ఈ బలమైన బ్యాటింగ్ ఆప్షన్‌లో సంజూ శాంసన్ జట్టులోకి రావడం కష్టంగా కనిపిస్తోంది.
వన్డే కెప్టెన్సీలోనూ మార్పు- రోహిత్ ప్లేస్‌లో హార్దిక్- IPL సీన్ రిపీట్?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్- భారత్ x పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?