Furiosa A Mad Max Saga Release Date : మ్యాడ్‌మ్యాక్స్ సిరీస్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేద. ఈ సిరీస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ అదిరే యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడా సిరీస్ నుంచి ఈ సారి ప్రీక్వెల్ వచ్చేందుకు రెడీ అయింది. ఫ్యూరియోసా ఏ మ్యాడ్‌మాక్స్ సాగా పేరుతో ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది.
రీసెంట్గా కూడా కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఈ ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాను స్క్రీనింగ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. ఏడు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ కూడా లభించింది. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా మూడు రోజుల్లోనే యాభై మిలియన్ డాలర్ల వసూళ్లను చేసిందని హాలీవుడ్ సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఇండియాలోనూ ఈ చిత్రం కచ్చితంగా వంద కోట్ల వసూళ్లను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా ఈ హాలీవుడ్ మూవీకి పెద్ద సినిమాలేవి పోటీగా రావట్లేదు. ఇది కూడా కలిసొచ్చే అవకాశం అని అంటున్నారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం మే 23న థియేటర్లలో విడుదల కానుంది.