ETV Bharat / lifestyle

చుండ్రు సమస్యకు చెక్ పెట్టే హెయిర్ ప్యాక్స్! ఇలా చేస్తే డాండ్రఫ్​ ఈజీగా తగ్గిపోతుందట! - HENNA HAIR PACK BNEFITS

-శీతాకాలంలో డాండ్రఫ్​ను వదిలించే చిట్కాలివే! -హెన్నాతో కలిపి ఈ హెయిర్ ప్యాక్ పెడితే చాలట!

Henna Hair Pack Bnefits
Henna Hair Pack Bnefits (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : 17 hours ago

Henna Hair Pack Bnefits: మనలో చాలా మందికి చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. ప్రత్యేకించి శీతాకాలంలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్​లో దొరికే వివిధ రకాల షాంపూలు వాడుతుంటారు. కానీ, ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలకు హెన్నా పొడి కలిపి తయారు చేసుకునే హెయిర్‌ ప్యాక్స్‌తో కూడా ఈ చుండ్రు సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కోడిగుడ్డు ప్యాక్: కోడి గుడ్డులోని తెల్లసొన జుట్టుకు పోషణను అందించడంలో ఎంతగానో సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇది చుండ్రును తొలగించడానికీ ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. ఇందుకోసం మూడు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడి, టేబుల్‌స్పూన్ ఆలివ్ నూనె, రెండు టేబుల్‌స్పూన్ల బాగా బీట్ చేసిన గుడ్డు తెల్లసొనను.. ఒక బౌల్‌లో తీసుకొని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ మృదువైన పేస్ట్‌లా తయారుచేసుకోవాలట. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి 45 నిమిషాల పాటు ఉంచుకోవాలని తెలిపారు. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని రోజుల్లోనే చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుందని వెల్లడిస్తున్నారు.

మిరియాలు: జుట్టు కుదుళ్లలోని ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో మిరియాలు చక్కటి పరిష్కారం చూపుతాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా.. ముఖ్యంగా చుండ్రును తగ్గించడంలోనూ ఇది బాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర పేస్ట్, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలని చెబుతున్నారు. అనంతరం ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలని తెలిపారు. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే త్వరలోనే చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందచ్చని అంటున్నారు.

ఈ నూనెతో: చుండ్రు సమస్యను తగ్గించడానికి ఆవనూనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా పావు లీటర్ ఆవనూనెను ఒక గిన్నెలో తీసుకొని వేడి చేయాలని తెలిపారు. దాన్నుంచి పొగ వెలువడుతున్న సమయంలో స్టౌ కట్టేసి అందులో గుప్పెడు గోరింటాకు, టీస్పూన్ మెంతుల్ని వేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ నూనెను పూర్తిగా చల్లారనిచ్చి వడకట్టుకొని గాలి చొరబడని సీసాలో స్టోర్ చేసుకోవాలని వివరిస్తున్నారు. ఇలా రెడీ చేసుకున్న నూనెను తలస్నానానికి ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలని తెలిపారు. సుమారు గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.

జుట్టు ఆరోగ్యానికీ: జుట్టు ఆరోగ్యానికి దోహదం చేసేందుకు, పలు కేశ సంబంధిత సమస్యల్ని తగ్గించడానికి హెన్నాను వాడుతుంటారు. చుండ్రును తగ్గించడంలో కీలక పాత్ర పోషించే హెన్నా కేశాలకు సహజసిద్ధమైన రంగును అందించడంతో పాటు జుట్టును కండిషనింగ్ కూడా చేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా.. ఇందులోని సహజసిద్ధమైన గుణాలు జుట్టుకు పోషణను అందించి కేశాలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయని వివరిస్తున్నారు. ఈ పొడిలోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే ఇది పొడిబారిన జుట్టుకు తేమను అందించడానికి, చివర్లు చిట్లే సమస్యను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 2015లో Journal of Cosmetic Dermatologyలో ప్రచురితమైన Henna (Lawsonia inermis) as a treatment for dandruff అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇవి గుర్తుంచుకోండి!

  • అయితే హెన్నాతో తయారుచేసిన హెయిర్‌ ప్యాక్‌లను మరీ ఎక్కువగా ఉపయోగించడం జుట్టు ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.
  • అలాగే పొడి జుట్టు ఉన్న వారు ఈ ప్యాక్‌లు తొలగించుకున్న వెంటనే కండిషనర్ రాసుకోవడం మర్చిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా కేశాలు మరింత పొడిబారకుండా జాగ్రత్తపడచ్చని వివరిస్తున్నారు.
  • ఇంకా కొన్ని పదార్థాలు సహజ సిద్ధంగా లభించేవే అయినా కొంతమందికి పడకపోవచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ చిట్కాలను పాటించే ముందు ఓసారి సౌందర్య నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

తలకు వేసిన రంగు మచ్చలు పోవట్లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఈజీగా పోతాయట!

పగుళ్లు పోయి పాదాలు సాఫ్ట్​గా కావాలా? ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలంటున్న వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.