తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గ్రాండ్​గా ఎమ్మీ అవార్డుల వేడుక - నిరాశపరచిన శోభిత ధూళిపాళ్ల నటించిన సిరీస్​ - EMMY AWARDS 2024 SOBHITA DHULIPALA

న్యూయార్క్‌లో జరిగిన ఎమ్మీ అవార్డుల వేడుకలో నిరాశపరిచిన శోభిత ధూళిపాళ్ల నటించిన వెబ్​ సిరీస్​.

Emmy Awards 2024  Sobhita Dhulipala
Emmy Awards 2024 Sobhita Dhulipala (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 12:37 PM IST

Emmy Awards 2024 : సినీ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారాల్లో ఎమ్మీ అవార్డ్స్​ కూడా ఒకటి. తాజాగా ఈ అవార్డ్ వేడుక న్యూయార్క్‌లో గ్రాండ్​గా జరిగింది. ఈ అవార్డు వేడుకలో ఓ ఇండియ్ యాక్టర్​ కూడా సందడి చేశారు. బాలీవుడ్‌ హాస్య నటుడు వీర్‌ దాస్‌ ఈ ప్రతిష్టాత్మక అవార్డ్​ ఫంక్షన్​కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఈ అవార్డుల్లో శోభిత ధూళిపాళ్ల నటించిన వెబ్‌ సిరీస్‌ ది నైట్‌ మేనేజర్​కు నిరాశ ఎదురైంది.

Sobhita Dhulipala The Night Manager Emmy Awards : అయితే ఈ అవార్డుల్లో శోభిత ధూళిపాళ్ల నటించిన వెబ్‌ సిరీస్‌ ది నైట్‌ మేనేజర్‌ బెస్ట్ వెబ్‌ సిరీస్‌ విభాగంలో పోటీ పడింది. చాలా మంది సినీ ప్రియులు ఈ సిరీస్​కు అవార్డు వస్తుందని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు వారికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఉత్తమ వెబ్‌ సిరీస్‌గా ఫ్రెంచ్ సిరీస్‌ 'లెస్‌ గౌట్టెస్‌ డి డైయూ' అవార్డును ముద్దాడింది.

ఇక ఈ వేడుక చివర్లో వీర్‌ దాస్‌ మాట్లాడుతూ "నేను మీ అందరినీ అలరించానని ఆశిస్తున్నాను. ఇంత గొప్ప వేడుకకు వ్యాఖ్యతగా వ్యవహరించడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ వేడుకలో హోస్ట్‌గా వ్యవహరించడానికి ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటా. అవార్డులు గెలుచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలు అన్ని అవార్డుల కన్నా గొప్పవి" అని ఆయన చెప్పారు.

అవార్డుల విజేతలు వీరే

బెస్ట్ సిరీస్‌ - లెస్‌ గౌట్టెస్‌ డి డైయూ

బెస్ట్ యాక్టర్ - తిమోతీ స్పాల్‌

బెస్ట్ కామెడీ సిరీస్​ - డివిజన్‌ పలెర్మో

బెస్ట్​ టీవీ మూవీ - లైబ్స్ కైండ్‌

బెస్ట్ యానిమేటెడ్​ సిరీస్‌ -టాబీ మెక్‌టాట్‌

Naga Chaitanya - Sobhita Wedding Date : ఇకపోతే ప్రస్తుతం శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. అక్కినేని హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకోనుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా డిసెంబర్‌ 4న చైతన్య - శోభిత వివాహం జరగనుంది. 300 మంది అతిథుల సమక్షంలో సింపుల్‌గా ఈ పెళ్లి జరగనుంది.

రెహమాన్‌ విడాకులతో లింక్‌ రూమర్స్​ - మరోసారి స్పందించిన మోహినిదే

'వాళ్లు సెకండ్‌ హ్యాండ్‌ అన్నారు - అయినా రివెంజ్ తీసుకోలేదు' - విడాకులపై సమంత

ABOUT THE AUTHOR

...view details