H Vinoth Thalapathy 69 :కోలీవుడ్ హీరో విజయ్ దళపతికి టాలీవుడ్‌లోనూ క్రేజ్ ఎక్కువే. ప్రస్తుతం గోట్ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ ఈ మధ్యే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై రాజకీయాల్లోనే ఉండిపోవాలనుకున్న విజయ్ తన కెరీర్లో మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించనున్నారు. అయితే విజయ్ తన చివరి సినిమాను మొదటగా ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత దళపతి69 నుంచి ఆయన తప్పకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి టాలీవుడ్ అగ్ర నిర్మాత దానయ్య తప్పకోవాడానికి గల కారణాలు తాజాగా తెలిశాయి.
అంత ఇవ్వలేక - హిట్టా, ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన బెడితే మూమూలుగానే విజయ్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంటుంది. ఇప్పుడు విజయ్ చివరగా నటించబోయే సినిమా ఇదే అనే టాక్ అంతటా వినిపిస్తుండతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ తన ఆఖరి సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. అయితే ఇంత పారితోషకం ఇచ్చుకోలేకనే ఆర్ఆర్ఆర్ నిర్మాత దళపతి69 నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతానికి ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
లియో ప్రొడ్యూసర్లే - ఇకపోతే గతేడాది విజయ్ నటించిన లియో సినిమా ప్రొడ్యూసర్లే ఈ దళపతి 69 చిత్రానికి కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తారనే పుకారు పుట్టుకొచ్చింది. లియో సినిమాకు సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత ఎస్ఎస్ లలిత్ కుమార్, విజయ్ మేనేజర్ జగదీశ్ పళనిస్వామి ప్రొడ్యూసర్లుగా వర్క్ చేశారు. ఇప్పుడు విజయ్ ఆఖరి సినిమాను కూడా వీళ్లే నిర్మిస్తారనే వార్తలు ప్రస్తుతం బాగా వినిపిస్తున్నాయి. దీని గురించి విజయ్ టీం ఇంకా ఆఫీషియల్‌గా ఏమీ వెల్లడించలేదు.