Trisha Krishnan Stage Name Change : తమ అసలు పేరుతో కాకుండా స్క్రీన్ పేరుతో పరిచయం అవుతుంటారు. ఆ పేరుతోనే పాపులర్ అవుతుంటారు. శివాజీ రావ్ గైక్వాడ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ రజనీకాంత్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అలాగే ఎంతో అసలు పేర్లు కాకుండా సినిమాలోకి వచ్చాక పెట్టుకున్న పేర్లతోనే ఇప్పటికీ చాలా మంది పాపులర్ అయ్యారు. అయితే కోలీవుడ్ నటి త్రిష విషయంలో మాత్రం ఇందకు భిన్నంగా జరిగింది. తను ఒక స్టేజ్ నేమ్‌తో సినిమాల్లోకి రావాలని అనుకుంటే, ఆఖరికీ తన ఒరిజినల్ పేరుతోనే ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఎందుకంటే?
తన పాత ఇంటర్వ్యూలలో త్రిష ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె మొదట సుహాసిని అనే స్టేజ్‌నేమ్‌తో సినిమాల్లోకి రావాలని అనుకున్నారట. దురదృష్టవశాత్తు, ఆమె చేసిన ఏ సినిమాకీ ఆ పేరు వేయలేదు. దీంతో తన అసలు పేరు త్రిషతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
మోడలింగ్‌కే ప్రాధాన్యం
సినిమాల్లోకి రాకముందే త్రిష మోడలింగ్, పోటీలు, ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆమె 'మిస్ సేలం స్టీల్ సిటీ' కిరీటాన్ని పొందారు. 1999లో 'మిస్ చెన్నై' గెలుపొందారు. ఓ ఇంటర్వ్యూలో త్రిష తన కెరీర్ తొలినాళ్ల గురించి చెప్పుకొచ్చారు.
'సినిమాల్లోకి రాకముందు సుమారు ఏడు నెలల పాటు నేను మోడలింగ్ చేశాను. నా వర్క్‌ను చాలా ఎంజాయ్ చేశాను. అయితే యాక్టింగ్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకంటే మోడలింగ్‌కే ప్రాధాన్యత ఇచ్చాను.' అని పేర్కొన్నారు.