Royal Enfield Scram 411 Discontinued: రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. కంపెనీ తన 'రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411' మోడల్ సేల్స్‌ను భారత్ మార్కెట్లో నిలిపివేసింది. ఈ క్రమంలో తన అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ మోటార్‌సైకిల్‌ను తొలగించింది. ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవలే 'రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440'ను విడుదల చేసింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 2.08 లక్షలు (ఎక్స్-షోరూమ్).
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 డిజైన్: ఈ 'స్క్రామ్ 411' మోడల్ మోటార్ సైకిల్‌ను 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411' ఆధారంగా రూపొందించారు. అయితే ఇందులో స్మాలర్ వైర్-స్పోక్ వీల్స్‌ను అమర్చినప్పటికీ ఇది అదే ఇంజిన్, ఛాసిస్‌ను ఉపయోగించింది. దాని పూర్తి స్థాయి ADV వెర్షన్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ బాడీవర్క్, బరువును కలిగి ఉంది. 'స్క్రామ్ 411' ముఖ్యంగా స్క్రాంబ్లర్ సామర్థ్యాలను అందించింది. ఇది సిటీ రైడింగ్, కొన్ని ఆఫ్-రోడ్ ట్రైల్స్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 పవర్‌ట్రెయిన్: 'స్క్రామ్ 411' ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో 411cc ఇంజిన్ ఉంది. ఇది 6,500rpm వద్ద 24.3bhp శక్తిని, 4,250rpm వద్ద 32 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత అయి వస్తుంది. ఈ ఇంజిన్ టార్కీ అండ్ రెస్పెన్సివ్. కానీ హైవేపై అధిక వేగంతో డ్రైవింగ్ చేసే సమయంలో ఉపయోగించేందుకు ఇందులో సిక్స్త్ గేర్ లేదు.
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440: కంపెనీ కొత్త 'రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440'తో ఈ సమస్యను పరిష్కరించింది. ఇందులో పెద్ద ఇంజిన్, ఎక్కువ పవర్, సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించింది. అంతేకాక ఈ మోడల్లో ట్యూబ్-టైప్ టైర్లతో వైర్-స్పోక్ రిమ్స్ లేదా ట్యూబ్‌లెస్ టైర్లతో అల్లాయ్ వీల్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇటీవలే మార్కెట్లో లాంఛ్ అయిన ఈ బైక్ పవర్‌ట్రెయిన్, హార్ట్‌వేర్, వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ వంటి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ధర: 'రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440' ధర 'స్క్రామ్ 411' కంటే కేవలం 2,000 రూపాయలే ఎక్కువ అనుకునేలోపే ఈ మోడల్ ఎంట్రీతో కంపెనీ ఇప్పుడు మార్కెట్లో 'స్క్రామ్ 411' సేల్స్‌ను నిలిపివేసింది.
వివో నుంచి అదిరిపోయే స్మార్ట్ఫోన్లు- లాంఛ్‌కు ముందే స్పెక్స్ లీక్!
కొత్త కారు కొనాలా?- అయితే వెంటనే త్వరపడండి- ఆలస్యం చేస్తే ఇక బాదుడే!
స్టన్నింగ్ లుక్‌లో 'కీవే K300 SF' లాంఛ్- ఏకంగా రూ.60వేల తగ్గింపు ధరతో- వారికి మాత్రమే!