తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ధనుశ్ సపోర్ట్ లేకుంటే ఆ సినిమాకు నో చెప్పేదాన్ని : సాయి పల్లవి - SAI PALLAVI ABOUT DHANUSH

ధనుశ్ అలా చెప్పకుంటే నేను ఆ సినిమా నుంచి తప్పుకునేదాన్ని : సాయి పల్లవి

Sai Pallavi About Dhanush
Dhanush, Sai Pallavi (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 6:01 PM IST

Sai Pallavi About Dhanush : టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఇటీవల శివకార్తికేయన్​తో కలిసి 'అమరన్'లో మెరిశారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడడమే కాకుండా, సినిమా కూడా హిట్ టాక్ అందుకుంది. అయితే, కోలీవుడ్ స్టార్ ధనుశ్​ లేకపోతే తాను ఓ సినిమా నుంచి తప్పుకునేదాన్నంటూ సాయిపల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

'ధనుశ్​ గైడెన్స్ లేకుంటే ఆ సినిమా నుంచి తప్పుకునేదాన్ని'
'ఎన్​జీకే' సినిమా షూటింగ్ సమయంలో నాకు సెట్స్​లో నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. అక్కడ నేను యాక్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ సెల్వ రాఘవన్ నేను బాగా నటించానో లేదో అని అస్సలు చెప్పేవారు కాదు. దీంతో నాకు కాస్త అసౌకర్యంగా అనిపించేది. అప్పుడే ధనుశ్​ నన్ను పిలిచి సెల్వ రాఘవన్ మూవీ షూటింగ్‌ ఎలా జరుగుతోంది. షూటింగ్ సంగతులు ఏంటని అడిగారు. అప్పుడు ఆయనకు ఈ విషయం చెప్పాను. అప్పుడు ఆయన చాలా సపోర్ట్ చేశారు. 'బాధపడకండి. సెల్వ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది' అని అన్నారు. ఆయన లేకుంటే నేను 'ఎన్​జీకే' మూవీ నుంచి తప్పుకునేదాన్ని." అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

ఇక ధనుశ్​తో మాట్లాడిన తర్వాత సాయిపల్లవి మనసు కుదుటపడిందట. ఫుల్ ఎనర్జీతో ఎన్​జీకే షూటింగ్​కు వెళ్లారట సాయి పల్లవి. ఇక ఈ సినిమా సెట్​లో హీరో సూర్య కూడా ఆమెకు పలు విషయాల్లో అండగా నిలిచారట. అయితే భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది.

అమరన్ గ్రాండ్ సక్సెస్
కాగా, ఇప్పుడు సాయి పల్లవి 'అమరన్‌'తో సూపర్ సక్సెస్​ అందుకున్నారు. ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్ ఆధారంగా ఈ మూవీని దర్శకుడు రాజ్‌ కుమార్‌ పెరియసామి తెరకెక్కించారు. ఇందులో శివ కార్తికేయన్‌ ముకుంద్‌ పాత్ర పోషించగా, ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి కనిపించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి టాక్ అందుకుంటోంది. అంతేకాకుండా కలెక్షన్లలోనూ అదరగొడుతోంది.

అతడు కాల్ చేసి నాతో అలా మాట్లాడాడు! : బాలీవుడ్​పై సాయి పల్లవి కీలక కామెంట్స్

సాయి పల్లవి అలా పిలిచినందుకు ఫీలయ్యా : శివకార్తికేయన్‌

ABOUT THE AUTHOR

...view details