Dhanunsh Shekar Kammula Movie :కోలీవుడ్ స్టార్ హీరోధనుశ్, నాగార్జున కాంబినేషన్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌తో పాటు ధనుశ్ ఫస్ట్ లుక్కు సంబంధించిన వీడియో, పోస్టర్స్‌ను రివీల్ చేశారు.
ఇక ఈ చిత్రానికి 'కుబేర' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ పోస్టర్లో టైటిల్‌కు భిన్నంగా ఉన్న లుక్‌లో ధనుశ్ కనిపించారు. చిరిగిన బట్టలు, మాసిన జుట్టు, గుబురు గడ్డంతో ఉన్నారు. ఇక ధనుశ్ వెనక ఓ ఆసక్తికరమైన పెయింటింగ్ ఉంది. అన్నపూర్ణ దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా ఉన్న ఆ చిత్రం సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. అందులోని శివుడి పెయింటింగ్ ముందు ధనుశ్ ఆయనకు ప్రతిరూపంలా నిల్చున్నాడు. ఇలా పలు అంశాలు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుతున్నాయి. టైటిల్ రివీల్ వీడియోలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది.
మరోవైపు ఈ టైటిల్ రివీల్ వీడియో చూసిన్ ఫ్యాన్స్ ఈ సినిమాలో ధనుశ్, నాగార్జునల పాత్రలు ఎలా ఉండనున్నాయో అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష రష్మిక మందన్న కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైర నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.