Devara Special Interview With Siddu Jonnalagadda :జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన టీమ్‌తో కలిసి 'దేవర' మూవీప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విష్వక్ సేన్‌లతో ముచ్చటించారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈవెంట్లో తారక్ ఈ చిత్రం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
నాలుగు భాషల్లో డబ్బింగ్
జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగే కాకుండా పలు ఇతర భాషలు వచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పటికే కొన్ని ఈవెంట్స్‌లోనూ తన వెర్సటాలిటీ చూపిస్తూ అక్కడి అభిమానులను ఆకట్టుకున్నారు కూడా. అయితే ఇప్పుడు 'దేవర' కోసం మరోసారి తన ఈ మల్టీ లాంగ్వేజ్ ట్యాలెంట్‌ను ఉపయోగించారట. ఈ చిత్రం కోసం ఆయన తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళంలోనూ డబ్బింగ్ చెప్పినట్లు తారక్ స్వయంగా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ తారక్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆయనలోని ఈ కొత్త కోణాన్ని చూసి మురిసిపోతున్నారు.
ఆ సీన్స్ చిరాకు కలిగించింది
ఇక ఇదే ఈవెంట్లో తనకు షూటింగ్లో చిరాకు తెప్పించిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తనకు కోపం కూడా పెరిగిందని అన్నారు.
గోవాలో జరిగిన సీన్స్ వల్ల నాకు బీపీ పెరిగిపోయింది. అక్కడ ఎండ బీభత్సంగా ఉంది. చెమటలు కూడా బాగా పడుతున్నాయి. నిప్పుల వర్షం కురుస్తుందేమో అన్నట్లుగా ఉంది ఆ వాతావరణం. చచ్చిపోతానేమో అని అనిపించింది. అలాంటి టైమ్‌లో నవ్వుతూ డైలాగులు చెప్పాలి. దీంతో ఎప్పుడెప్పుడు సీన్ అయిపోతుందా అంటూ ఎదురుచూశాను. సీన్ అవ్వగానే ఏసీ రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాను. అలా పడుకొన్నప్పుడే కరెంట్ పోయింది. ఆ ముందు రోజే అక్కడ జనరేటర్ పాడైందట. దీంతో రూమ్‌లో ఉండాలో బయటకు వెళ్లాలో నాకు అర్థం కాలేదు. సుమారు 40 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది. ఈలోపు షాట్ రెడీ అని పిలుపొచ్చింది. ఛీ అనిపించి నాపై నాకే చిరాకు వేసింది." అంటూ జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' షూటింగ్ గురించి చెప్పుకొచ్చారు.
'దేవర' స్పెషల్ షోస్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! - టికెట్ ధర ఎంత పెరిగిందంటే? - Devara Special Shows
'దేవర' అనే టైటిల్ అందుకే పెట్టాం : ఎన్టీఆర్ - NTR Comments on Devara Title