తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'డెకాయిట్' నుంచి శ్రుతిహాసన్ ఔట్- ఆయన వల్లేనా? - DACOIT MOVIE SHRUTI HAASAN

అడవి శేష్ 'డెకాయిట్' నుంచి తప్పుకున్న శ్రుతిహాసన్! కారణం ఏంటంటే?

Dacoit Movie Shruti Haasan
Shruti Haasan (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2024, 11:05 AM IST

Dacoit Movie Shruti Haasan :స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి అందరికీ తెలిసిందే. విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మొదట్లో సింగింగ్​లో తన టాలెంట్​ను నిరూపించుకున్న ఈ అమ్మడు, ఆ తర్వాత హీరోయిన్​గా సత్తా చాటుతున్నారు. అయితే టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో వర్క్ చేసిన శ్రుతి హాసన్, చివరగా ప్రభాస్ 'సలార్' మూవీలో కనిపించారు.

డెకాయిట్ నుంచి శ్రుతి హాసన్ ఔట్!
ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు చిత్రాల పరంగా చూస్తే అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'డెకాయిట్' మాత్రమే ఉంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షనైల్ డియో తొలిసారి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్న మూవీ ఇది. ఇప్పటికే ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో తుపాకీ పట్టుకుని, శ్రుతి గ్లింప్స్​లో కనిపించారు. అడివి శేష్, శ్రుతి ప్రేమించుకుని విడిపోయి మళ్లీ కలిసి దోపిడీలు చేయడం చుట్టూ సినిమా తిరుగుతున్నట్లు టీజర్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఇంటెన్స్, లవ్ యాక్షన్ చిత్రంగా 'డెకాయిట్' తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు శ్రుతి హాసన్ 'డెకాయిట్' నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.

డేట్స్ ఇష్యూ వల్లే!
ఇప్పటికే 'డెకాయిట్' మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యిందని సిినీ వర్గాల సమాచారం. డేట్స్ ఇష్యూ వల్ల శ్రుతి హాసన్ 'డెకాయిట్' ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ప్లేస్​లో మరొక హీరోయిన్​ను మేకర్స్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ షనైల్ డియో తన ఫ్యామిలీలో కలిసి పని మీద విదేశాలకు వెళ్లారట. అప్పుడు సినిమాలోని కొన్ని షాట్లను హీరో అడివి శేష్ తెరకెక్కించేందుకు ప్రయత్నించారట. అది కూడా శ్రుతి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి ఓ కారణమని తెలుస్తోంది.

సినిమా పరంగా చూస్తే
ఇక 'డెకాయిట్' సినిమా విషయానికొస్తే, ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నటి సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'క్షణం', 'గూఢచారి' లాంటి బ్లాక్​బస్టర్‌ సినిమాలకు ఫోటోగ్రఫీ డైరెక్టర్​గా పనిచేసిన షనైల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్​గా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో వేర్వేరుగా షూటింగ్ జరుపుతామని మూవీ టీమ్ తెలిపింది.

శత్రువులుగా మారిన ప్రేమికులు- అడివి శేష్ 'డెకాయిట్' టీజర్​ రిలీజ్

అడివి శేష్​కు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్​- శ్రుతి హాసన్​కు జోడీగా

ABOUT THE AUTHOR

...view details