Daaku Maharaj Success Celebrations :నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న రిలీజై మంచి విజయం దక్కించుకుంది. దీంతో మేకర్స్ సక్సెస్ సంబరాలు నిర్వహించారు. ఈ ఈవెంట్కు నటసింహం బాలయ్య, మూవీటీమ్తో సహా పలువురు టాలీవుడ్ హీరోలు సైతం హాజరై సందడి చేశారు.
అయితే ఈ ఈవెంట్లో బాలయ్య డ్యాన్స్ హైలైట్గా నిలిచింది. బాలీవుడు బ్యూటీ ఊర్వశీ రౌతేలాతో ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమెతో హుషారుగా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక 'బాలయ్యా మజాకా', 'జై బాలయ్య' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
విష్వక్, సిద్ధూ కూడా
ఈ సక్సెస్ సంబరాల్లో యంగ్ హీరోలు విష్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు. ఈవెంట్లో బాలయ్యతో కలిసి చేసిన ఫన్నీ వీడియోను హీరో విష్వక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బాలయ్య 'నా సక్సెస్ ఇండస్ట్రీ సక్సెస్' అంటూ మాట్లాడడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.