Classic Sitcoms In OTT :ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎవరు అవునన్నా, కాదన్నా ఈ మాటలో నిజం లేకపోలేదు. అప్పట్లో వచ్చే సినిమాలు, టీవీ సీరియల్స్‌ని కుటుంబమంతా కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్లు. కొన్ని సీన్స్‌ని ఇప్పుడు గుర్తు చేసుకొన్నా పడీ, పడీ నవ్వుకుంటారు. సన్నివేశాల నుంచి క్రియేట్ అయ్యే కామెడీ అంత అద్భుతంగా ఉండేది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆ రోజులు ఏమైనా తిరిగొస్తాయాని అనుకుంటున్నారా? ఆ రోజులు రానక్కర్లేదు, ఆ టీవీ సీరియల్స్ వస్తే సరిపోదా? కాస్త సమయం కేటాయిస్తే, అవే మిమ్మల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్లిపోతాయి.
90లు, 2000ల ప్రారంభంలో అందరినీ ఆకట్టుకున్న ఏడు ఫైవ్ టీవీ షోలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ టీవీ షోలు ఏంటి? ఏ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
సారాభాయ్ Vs సారాభాయ్ (డిస్నీ+ హాట్‌స్టార్)
ఈ సీరియల్, డిన్నర్ టైమ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. దక్షిణ ముంబయిలోని నాగరిక కఫ్ పరేడ్ పరిసరాల్లో నివసించే అప్పర్ క్లాస్ గుజరాతీ ఫ్యామిలీ అయిన సారాభాయ్‌ల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ కల్ట్ క్లాసిక్ షోలో అన్ని రకాల కుటుంబ పాత్రలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఆయా పాత్రల మధ్య క్రియేట్ అయ్యే కామెడీని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇందులో సతీష్ షా, రత్న పాఠక్ షా, సుమీత్ రాఘవన్, రూపాలి గంగూలీ, రాజేశ్ కుమార్ లాంటి బుల్లితెర స్టార్స్ నటించారు.
ఖిచ్డీ (డిస్నీ+ హాట్‌స్టార్)
పాత భవనంలో నివసించే గుజరాతీ కుటుంబంఅయిన పరేఖ్‌ల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. కుటుంబ సభ్యులందరి చమత్కారమైన వ్యక్తిత్వాలు ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా ప్రఫుల్, హంసా ఒకరిని మించి మరొకరు కామెడీ పండిస్తారు. వీరితో పాటు అనంగ్ దేశాయ్, రాజీవ్ మెహతా, సుప్రియా పాఠక్, వందనా పాఠక్, జమ్నాదాస్ మజేథియా, రిచా భద్ర, యష్ మిట్టల్ లాంటి స్టార్స్ కూడా తమ పాత్రలతో ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పూయిస్తారు.