తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'విశ్వంభర' వాయిదాకు కారణం అదే- గేమ్​ఛేంజర్ కాదట! - VISHWAMBHARA MOVIE RELEASE

Vishwambhara Movie Release : విశ్వంభర మూవీ రిలీజ్ వాయిదా- దర్శకుడికి చిరు సూచనలు- అందుకోసమేనా?

Vishwambhara Movie Release
Vishwambhara Movie Release (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 6:40 PM IST

Updated : Oct 16, 2024, 6:52 PM IST

Vishwambhara Movie Release :యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. భారీ బడ్జెట్​తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా విడుదలైన 'విశ్వంభర' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వాస్తవానికి ఈ సినిమా 2025 సంక్రాంతి రావాల్సింది. కానీ, రామ్​చరణ్ 'గేమ్ ఛేంజర్' కోసం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం విశ్వంభర గురించి సోషల్ మీడియాలో మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

మరో కారణం ఉందా!
అయితే గేమ్ ఛేంజర్ కోసమే కాకుండా విశ్వంభర సినిమా రిలీజ్ పోస్ట్​పోన్ కావడానికి మరో కారణం ఉందని వార్తలు వస్తున్నాయి. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా, వీఎఫ్ఎక్స్​పై విమర్శలు వచ్చాయి. గ్రాఫిక్స్ షాట్లు అంతగా బాగాలేవని నెట్టింట చర్చ జరిగింది. అలాగే మెగాస్టార్ చిరుకు కూడా వీఎఫ్ఎక్స్ సీన్స్ అంతగా నచ్చలేదట. వాటిని మార్చమని దర్శకుడిని సూచించారట. వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీపడొద్దని, మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని కోరారట. అందుకే విశ్వంభర రిలీజ్ వాయిదా వేశారని చర్చ నడుస్తోంది.

రంగంలోకి వీవీ వినాయక్
విశ్వంభర వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం సీనియర్ దర్శకుడు వీవీ వినాయక్ రంగంలోకి దిగనున్నారని ఫిల్మ్ సర్కిల్స్​లో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 20ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా వినాయక్‌ దర్శకత్వం వహించిన 'ఠాగూర్‌' మంచి హిట్ అందుకుంది. అప్పట్నుంచీ చిరు-–వినాయక్‌ మధ్య మంచి అనుబంధం ఉంది. అలాగే చిరు రీ ఎంట్రీలో 'ఖైదీ నంబరు 150' చేశారు వినాయక్. ఈ చనువుతోనే విశ్వంభర వీఎఫ్ఎక్స్ సీన్స్ కోసం చిరు వినాయక్ ను రంగంలోకి దించారని తెలుస్తోంది.

'విశ్వంభర' సినిమా విషయానికొస్తే - సీనియర్ హీరోయిన్ త్రిష, అషికా రంగనాథ్‌, మృణాల్ ఠాకూర్, మీనాక్షీ చౌదరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కునాల్‌ కపూర్‌, జాన్వీ కపూర్ ఆయా పాత్రలు పోషించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ కలిసి నిర్మిస్తున్నారు. 'విశ్వంభర' సినిమా సోషియో ఫాంటసీ జానర్​లో తెరకెక్కుతోంది.

దసరా ట్రీట్​​ - అంతకుమించి అనేలా 'విశ్వంభర' విజువల్ వండర్​ టీజర్​

విశ్వంభర వర్సెస్ గేమ్​ఛేంజర్​ - టెన్షన్​ టెన్షన్

Last Updated : Oct 16, 2024, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details