తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఓ సారి అలా ప్రయత్నించండి' - హీరో జయంరవి దంపతులకు కోర్టు కీలక సూచన - JAYAM RAVI AARTI DIVORCE

డివోర్స్​ విషయమై జయం రవి, ఆయన సతీమణి ఆర్తికి కీలక సూచన ఇచ్చిన న్యాయస్థానం.

Jayam Ravi Aarti Divorce
Jayam Ravi Aarti Divorce (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 3:59 PM IST

Jayam Ravi Aarti Divorce : కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల తంతు ఆ మధ్య చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జయం రవి కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టు ఈ పిటీషన్​ను పరిశీలించింది. జయం రవి కోర్టుకు హాజరు అవ్వగా, ఆయన భార్య ఆర్తి వీడియో కాల్‌ ద్వారా న్యాయస్థానానికి అందుబాటులోకి వచ్చారు.

ఈ విచారణలో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, మరో సారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని, రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చింది. ఒకవేళ విడిపోవాలని అనుకుంటే మాత్రం, అందుకు గల స్పష్టమైన కారణాన్ని తెలియజేయాలని పేర్కొంది.

కాగా, 2009లో హీరో రవి, ఆర్తి వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పరస్పర అంగీకారంతోనే తాము విడిపోవాలని అనుకున్నట్లు సెప్టెంబర్‌లో జయం రవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. "ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి డివొర్స్​ తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం" అని పేర్కొన్నారు.

అయితే జయం రవి ప్రకటనపై ఆర్తి సంచలన ఆరోపణలు చేసి అందరికీ షాక్ ఇచ్చారు. తనకు తెలియకుండానే, అనుమతి తీసుకోకుండానే డివోర్స్​ గురించి రవి బహిరంగంగా ప్రకటించారని చెప్పారు. అలా వీరి విడాకుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలో తన భార్య ఆర్తి ఆరోపణలపై రవి ఆ మధ్య మీడియాతోనూ మాట్లాడారు. "లాయర్‌ ద్వారా ఆర్తికి డివోర్స్​ నోటీసు పంపించాను. ఈ విషయం ఆమె తండ్రికి కూడా తెలుసు. దీని గురించి మా ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలు కూడా చర్చించారు. నేను అందుబాటులో లేనని, వారికి తెలీకుండానే డివొర్స్​ ప్రకటించానని వాళ్లు ఎలా చెబుతారు? అని రవి అన్నారు.

ఇకపోతే ఓ సింగర్‌తో రవి రిలేషన్‌లో ఉన్నారంటూ జరిగిన ప్రచారంపైనా కూడా ఆయన స్పందించారు. అవన్నీ అవాస్తమేనని చెప్పారు.

మలయాళ డైరెక్టర్​తో నాని కొత్త మూవీ! - నేచురల్ స్టార్ లైనప్​లో ఎన్ని సినిమాలంటే?

'కంగువా' - ఆ గాయం వల్ల దిశాపటానీ 6 నెలలు గతం మర్చిపోయిందట!

ABOUT THE AUTHOR

...view details