Cannes film festival 2024 Urvashi Rautela :కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రస్తుతం అట్టహాసంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ తారలంతా కళ్లు చెదిరే డ్రెసుల్లో తమ అందాలను ఆరబోస్తూ ఈ రెడ్ కార్పెట్‌పై మెరుస్తుంటారు. వీరిలో భారత సినీ నటుల తళుకు బెళుకులు ఉంటాయి. అయితే రెడ్ కార్పెట్‌పై మెరిసిన ఇండియన్ హీరోయిన్స్‌లో ఊర్వశి రౌతేలా మాత్రం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆమె ఏకంగా రూ.105 కోట్ల విలువగల రెండు డ్రెస్సులను ధరించి ఆశ్చర్యపరిచింది.
పూర్తి వివరాల్లోకి వెళితే - ఈ సారి రెడ్ కార్పెట్‌పై అందాల తార ఐశ్వర్య రాయ్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, అదితి రావ్ హైదరీ, శోభితా ధూళిపాళ్ల, 11 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రీతి జింటా సహా పలువురు మెరిశారు. అయితే వీరందరూ ఒకెత్తైతే ఊర్వశి రౌతేలా మాత్రం మరో లెవల్ అనిపించింది. రెండు రోజుల పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై మెరిసిన ఈ ముద్దుగుమ్మ తొలిరోజు ఓ పింక్ గౌన్ ధరించింది. దీని ధర రూ.47 కోట్ల అని కథనాలు వస్తున్నాయి. మరి కొంతమంది రూ.7కోట్లు అని కూడా అంటున్నారు.
కేన్స్ నాలుగో రోజు వేడుకలోనూ మరింత ఖరీదైన డ్రెస్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది ఊర్వశి రౌతేలా. బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధరించింది. దీని ధర ఏకంగా రూ.58 కోట్లు అని చెబుతున్నారు. అలా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు అని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆ మధ్య కూడా తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా రూ.3.5 కోట్ల రూపాయల కేక్ కట్ చేసి అందర్నీ షాక్‌కు గురి చేసింది రౌతేలా. ప్రస్తుతం ఈ మద్దుగుమ్మ తెలుగులో బాలయ్య ఎన్బీకే 109సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తోంది.