Bigg Boss Season 8 Telugu Latest Updates:అతి త్వరలో సీజన్ 8 ప్రారంభం కానుండటంతో.. తెలుగునాట బిగ్‌బాస్ మేనియా ఊపందుకుంటోంది. ఈ షోకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బిగ్బాస్ 8కి సంబంధించి టీజర్, ప్రోమో రిలీజ్ కాగా.. దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సీజన్‍లో "డబుల్ ధమాకా" ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు చూస్తే..
బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన బిగ్బాస్కు.. వరల్డ్ వైడ్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గుర్తింపు ఉన్న సెలబ్రిటీలను ఒకే ఇంట్లో పెట్టి వారితో మూడు నెలల పాటు ఎంటర్‌టైన్ చేయిస్తోంది ఈ షో. ఈ క్రమంలో ఇంట్లో జరిగే గొడవలు, వాదనలు, లవ్ ట్రాక్స్, గాసిప్స్.. ఇలా అన్ని ఎలిమెంట్లూ బుల్లితెర ఆడియన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి.
బిగ్బాస్ 8 : ఈ సీజన్‍లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా? - లిస్ట్ మామూలుగా లేదు!
ప్రోమో ఇలా..బిగ్బాస్ సీజన్ 7 ఫైనల్ రోజు జరిగిన రచ్చ వల్ల.. ఈ షోపై చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. దీంతో బిగ్బాస్ ఇక ఉండదని.. సీజన్ 7 మాత్రమే లాస్ట్ అంటూ ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే.. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ బిగ్‍బాస్ 8కి సంబంధించి టీజర్, ప్రోమో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ప్రోమో చూస్తే ఇందులో నాగార్జున, కమెడియన్ సత్య ఉన్నారు. సత్యను ఓ లగ్జరీ హౌస్‍లోకి నాగార్జున తీసుకెళ్లడంతో ఈ నయా ప్రోమో షురూ అయ్యింది. అయితే, తనకు ఏకాంతం కావాలని సత్య అంటే మరోసారి ఆలోచించుకోవాలని నాగార్జున చెబుతారు. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదని అంటారు. తనకు ఫుల్ ప్రైవసీ కావాలని సత్య అంటారు. ఆ తర్వాత ఎడారిలో మాసిన దుస్తులతో సత్య కనిపిస్తారు. ఈ సారి సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్కు, ఫన్‍కు, టర్న్‌లకు, ట్విస్టులకు లిమిటే లేదు అని నాగార్జున చెప్పే డైలాగ్‍తో ప్రోమో పూర్తవుతుంది. సత్యను ఒంటరిగా వేరే చోటికి పంపడం ఈ ప్రోమోలో ఉండటంతో బిగ్‍బాస్ 8వ సీజన్‍లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా అనే అంచనాలు మొదలయ్యాయి.